SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

చిరస్మరణీయులు కాటన్‌ దొర..ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు

1 min read

ఉమ్మడి రాష్ట్రంలో వివాదాల్లో ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టులు మాత్రమే కేంద్ర జలసంఘం పరిధిలో ఉండాలని ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు అన్నారు. కాటన్‌ వర్థంతి సందర్భంగా పాలకొల్లు లాకుల సెంటర్‌ వద్ద కాటన్‌ భారీ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు ప్రకాశం, ధవళేశ్వరం వంటి బ్యారేజ్‌లు కేంద్ర జల సంఘం పరిధిలో ఉండటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలోని 107 అన్ని రకాల ప్రాజెక్టులు కేంద్రం అధీనంలో ఊండటం వల్ల మొత్తం పిల్లకాలువలు సైతం వారి పెత్తనంలో ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు నేతలు అడ్డాల వాసు, లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.
ఆచంట:గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి గోదావరి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అపర భగీరథుడు సర్దార్‌ కాటన్‌ దొర అని సర్పంచి సుంకర సీతారాం కొనియాడారు. కాటన్‌ వర్థంతి సందర్భంగా కొడమంచిలి పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న కాటన్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి చిలుకూరి రామచంద్రరావు ఎస్‌సి సెల్‌ మండల అధ్యక్షులు కొండేటి రమేష్‌, వైసిపి నాయకులు బొరుసు రాంబాబు, వనమారాజు, శశి, మధు పాల్గొన్నారు.
భీమడోలు:పూళ్ల శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ పాలకులు కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య జయంతిని, కాటన్‌ వర్థంతిని శనివారం నిర్వహించారు. ప్రముఖులు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భీమవరం రూరల్‌:గుర్రం జాషువా వర్థంతిని డిఎన్‌ఆర్‌ హైస్కూల్లో శ్రీవిజ్ఞానవేదిక అధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు పండితులు, రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయులు కలిగొట్ల గోపాలశర్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్‌ హెచ్‌ఎం ఎం.నిర్మలాదేవి, నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, ఎ.సోమేశ్వరశర్మ, భవానీ, ఉమా, వాణి పాల్గొన్నారు.
పాలకొల్లు : స్థానిక ఇరిగేషన్‌ కార్యాలయంలో కాటన్‌ వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి కవురు శ్రీనివాస్‌, వైసిపి రాష్ట్ర పంచాయతీ రాజ్‌ కార్యదర్శి యడ్ల తాతాజీ, వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లెం ఆనంద్‌ ప్రకాష్‌, ఎఎంసి ఛైర్మన్‌ నర్సయ్య, క్షీరారామలింగేశ్వర దేవాలయ ట్రస్ట్‌ ఛైర్మన్‌ కోరాడ శ్రీనివాస్‌, వైసిపి టౌన్‌ కన్వీనర్‌ చందక సత్తిబాబు, మండల కన్వీనర్‌ మైఖేల్‌ రాజు, సొసైటీ ఛైర్మన్‌ చెరుకూరి దత్తాత్రేయవర్మ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.

Also read

Total Page Visits: 237 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed