SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఘనంగా అల్లూరి జయంతోత్సవాలు.

1 min read



*మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు సందర్భంగా.*
*ఈ రోజు కొయ్యూరు మండలం,కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు స్మారక పార్క్ నందు! అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి గారి ఆధ్వర్యంలో ఘనంగా జయంతోత్సవాలు నిర్వహించారు.*
*ఈ సందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ….* నెత్తురు మండే యువత ఆరాధ్యుడు మన్యం గుండెల్లో కొలువైన దేవుడు.
బ్రిటిష్ సామ్రాజ్యాన్ని హడలుగొట్టినా వీరుడు, జాతీయోద్యమ జ్వాలను రగిలించిన నిప్పు కణిక అని!! అల్లూరి సీతారామరాజు గారిని ఉద్దేశించి ఆ వీరుడి 124వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
*మన్యం గుండెల్లో విప్లవ జ్యోతులు రగిలించి,బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన స్వాతంత్ర్య సమరయోధుడు,మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు.ఆ వీరుని స్ఫూర్తి తరతరాలకు స్ఫూర్తిదాయకం అని అన్నారు.*
*ఈ కార్యక్రమంలో నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివ ప్రసాద్ గారు,* బిడిజన అప్పారావు, సూరి బాబు,వివిధ గ్రామ పంచాయితీ సర్పంచ్ లు,ఎంపిటిసి అభ్యర్థులు,యువ నాయకులు,అల్లూరి సీతారామరాజు అభిమానులు మరియు
పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Total Page Visits: 52 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed