SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

గ్రామ సచివాలయ భావనాన్ని ప్రారంబించిన ఎమ్మెల్యే శంబంగి

1 min read


బొబ్బిలి
*బొబ్బిలి మండలం సి.హెచ్.బొడ్డవలస గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని బుధవారం స్థానిక శాసన సభ్యులు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ప్రారంభించారు.*

*ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే శంబంగి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయం మరియు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటుచేసిన ఘనత ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందన్నారు. గ్రామాల్లో గల ప్రజలు ప్రభుత్వ పథకాలు అందుకోవడంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండాలని,ప్రజల ముంగిట ప్రభుత్వ పాలన తీసుకురావాలనే దృఢ సంకల్పంతో సచివాలయ వ్యవస్థన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్లు ప్రజలతో మమేకమై వాళ్ల సమస్యలను అడిగి పరిష్కారం చేయాలని సూచించారు.*

*అదేవిధంగా గ్రామ సచివాలయ నిర్మాణానికి స్థలాన్ని బహుకరించిన స్థల దాతలకు ఆయన శాలువలతో ఘనంగా సన్మానించారు.*

*అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించబోయే వెల్నెస్ సెంటర్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంబంగి భూమి పూజ చేశారు.*

*ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరులు శంబంగి వేణుగోపాలనాయుడు గారు,పి.ఎ.సి.ఎస్ అధ్యక్షులు చొంగళ రాఘవ సర్పంచ్ వేలంగిని ,ప్రత్యేక అధికారి మాల కొండయ్య ,తహసిల్దార్ రామస్వామి ఎంపీడీఓ చంద్రమ్మ , అప్పారావు ,మాజీ సర్పంచ్ చొంగళ రామకృష్ణ,సత్యం నాయుడు,తదితరులు పాల్గొన్నారు.*

Total Page Visits: 33 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed