SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

గ్రామసచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ గంగాధర గౌడ్

1 min read

అనంతపురం ,జూన్ 4:
పెనుగొండ నియోజకవర్గం పరిధిలోని రొద్ధం, సోమందేపల్లి గ్రామ సచివాలయాలను జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం ) గంగాధర గౌడ్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గ్రామ సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ, సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.ముఖ్యంగా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను సకాలంలోప్రజలకు అందించాలని,ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా విధులను నిర్వర్తించాలన్నారు.పారదర్శకంగా అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలన్నారు.ప్రజలకు కరోనా పై అవగాహన కల్పించడంతోపాటు పరిసరాల వ్యక్తిగత శుభ్రత పాటించేలా చైతన్యం కల్పించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా పనిచేయాలన్నారు. ఆయా సచివాలయాల్లో ఉన్న హాజరు పట్టికలు, ఇతర రికార్డులను ఆయన పరిశీలించారు. సచివాలయ రికార్డులను పరిశీలించిన అనంతరం సిబ్బంది ,వాలంటీర్ల పనితీరుపై జాయింట్ కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

సహాయ సంచాలకులు,సమాచార పౌర సంబంధాల శాఖ ,అనంతపురం వారిచే జారీ.

Total Page Visits: 41 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed