SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

గో రక్షక చట్టాలెన్ని ఉన్నా ఆగని గోమాతల హత్యలు

1 min read

*
*ఇకనైనా గో రక్షక చట్టాల అమలుకు ప్రభుత్వాలు కృషి చేయాలి* – విశ్వహిందూ పరిషత్.

ఒంగోలు: నగరం లోని శ్రీనివాస సినిమా హాలు, పవర్ ఆఫీసు ఎదురు కరుణా కాలనిలో కబేళా రోడ్డులో గోమాతను హత్యచేస్తున్నారని అత్యంత విశ్వసనీయ సమాచారం అందుకొని వెళ్ళి చూడగ రెండు గోమాతలను హత్యచేసి ఉండటం జరిగినది.

విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్, గోరక్షా ప్రముఖ్, మరియు భజప ఒబిసి మోర్చా కార్యకర్తలు పరుగుపరుగున వెళ్ళగ అప్పటికే రెండవ గోమాతను హత్యచేసి అమ్మకానికి ఎదురు చూస్తున్నారు. వెంటనే తాలూక పోలీసులకు కబురందించగనే ఎస్సై, ముగ్గురు కానిస్టేబుల్స్ తో అక్కడకు వచ్చారు. అక్కడ ఆ గోహత్యలు చేసిన కోటేష్ మరియు అతని సహచరుని వెంటనే తాలుకా పోలీస్ స్టేషన్ కి తరలించి నిర్భందించారు.

వి.హెచ్.పి, బజరంగదళ్, గో సంరక్షా ప్రముఖ్, భజప, ఓబిసి మోర్చా ఆధ్వర్యములో తాలుకా పోలీస్టేషన్ లొ కంప్లంట్ ఇచ్చారు.

గో రక్షణ చట్టాలు గోవధ, పసుసంరక్షక చట్టం1977, సిఆర్పిసి 43, సెక్షన్ 5, సెక్షన్ 6, ఐపిసి 428 మరియు 429, సెక్షన్ 11ప్రకారం గోహత్యలు చేస్తున్న పాషాణ హృదయులను, గొ మాంసం అమ్మిన వారిపై కఠినమైన శిక్ష విధించాలని కోరారు.

అనంతరం గోవు మృతదేహమునకు ప్రభుత్వ పశువైద్యశాలలో పోస్ట్ మార్టం చేయించి, సంప్రదాయ లాంఛనాలతో సాగనంపారు.

ఈ సందర్భముగా జిల్లా బజరంగదళ్ సంయోజక్ యన్. సీతారామయ్య మాట్లాడుచూ ఎన్ని గోరక్ష చట్టాలున్నా, ఎన్ని గో సంరక్షక కేంద్రాలున్నా, భారతావనిలో గోవును సర్వదేవ స్వరూపంగా భావించే ప్రజల కళ్ళుగప్పి గోవును హత్యచేసి గోమాంసం అమ్మడాని, తినడానికి ఎన్నో పన్నాగాలు పన్నుచున్న వారిని కనిపెట్ట లేక, పట్టుకో లేక పోవడం ప్రభుత్వ అలసత్వమనే భావన హిందు ప్రజలలొ, భక్తులలొ కలుగుచున్నదని, కొంతమంది ఎక్కువ డబ్బు ఆశజూపి హిందువులచే గో హత్యలు చేయించడం చాలా జాగ్రత్తగ, చట్టాల పై అవగాహనతోనే ఎంతో పగడ్బందిగా ముందస్తు ప్రణాళికలను అమలు చేయిస్తున్నారని వివరించారు. గత నాలుగు రోజుల క్రితం విహెచ్పి, బజరంగదళ్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పోలీస్ అధికారులను కలసి గో వధ, గొవుల అక్రమ రవాణాల చట్టాలను పటిష్టముగ అమలుచేయాలని విజ్ఞప్తి చేశామని, అంతలోనే ఇలా జరగడం మనసు కలచివేసిందని, మున్సిపల్ అధికారులు కూడా గోహత్యలపై దృష్టిపెట్టాలని, హిందూ సనాతన సంప్రదాయాలను కాపాడటానికి కృషిచేయాలని కోరారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజులలో గోవును జాతీయ జంతువుగ ప్రకటించే చట్టం తెచ్చేవరకూ ధర్నాలు, రాస్తారోకోలు చేయడానికై ఉద్యమిస్తామని తెలిపారు.

Also read



పోలీస్ అధికారులను కలసిన వారిలో గో రక్షాప్రముఖ్ గడ్డం శ్రీనివాసులు, జిల్లా బజరంగదళ్ సంయోజక్ యన్. సీతారామయ్య, భజప ఒబిసి మోర్చా నాయకులు తానికొండ సురేష్, విహెచ్పి ప్రచార ప్రముఖ్ రాధా రమణ గుప్తా జంధ్యం, ఆరెస్సెస్ శివాజి, భజప నాయకులు ధనిశెట్టి రాము, కె. రామగోపి, హరికృష్ణ, రాజేష్ సింగోతు తదితరులు ఉన్నారు.

Total Page Visits: 131 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed