SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

గూడూరు టౌన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ముద్దాయిల అరెస్ట్

1 min read

గూడూరు టౌన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ముద్దాయిల అరెస్ట్
– పథకం ప్రకారమే హత్య
> సన్నిహితుల సహకారంతోనే బయట కాపలాగా పెట్టి హత్య
> తల్లిదండ్రులు రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకమాడిన ముద్దాయి
– చాకచక్యంగా మిగిలిన ముద్దాయిలను పట్టుకున్న గూడూరు పోలీసులు
– ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్.. హత్యకు ఉపయోగించిన సామాగ్రి స్వాధీనం
కేసు వివరాలు: Cr.No.63/2021 u/s 354-D, 449,342,302 r/w 34 IPC, Sec. 309 IPC of Gudur 2
town PS
ఫిర్యాది:- పాలపర్తి సుధాకర్, గూడూరు టౌన్, స్వర్ణ భారతి నగర్
ముద్దాయిల వివరాలు: A1-గునిశెట్టి వెంకటేశ్వర్లు @ వెంకటేష్ తండ్రి చెంచు కృష్ణయ్య, వయస్సు-29
సంవత్సరములు, కులం- ముత్తరాశి, పాత పోస్ట్ ఆఫీసు దగ్గర, సొసైటీ, గూడూరు టౌన్
A2-చిట్టేటి పృద్విరాజ్ తండ్రి రాజయ్య, వయస్సు 24, ముత్తరాసి, కురుగొండ్ల గ్రామం, ఓజిలి మండలం
A3-బండ్ల శివ తండ్రి మల్లికార్జున , వయస్సు 22, గౌడ, చింతవరం గ్రామం, చిల్లకూరు మండలం
అరెష్టు సమయం: 06.07.2021 న A1 రాత్రి 8.30 గంటలకు,
A2, A3 లను 07.07.2021 న ఉదయం 7 గంటలకు రైల్వే స్టేషన్ వద్ద
స్వాధీన చోరి సొత్తు : 3 సెల్ ఫోనులు, 1 బైకు, చాకు స్వాధీనం
కేసు వివరాలు:
01.07.2021 న సుమారు 1130 గంటలకు గూడూరు టౌన్, స్వర్ణ భారతి నగర్ నందు జరిగిన
హత్య కేసులో A1-గునిశెట్టి వెంకటేశ్వర్లు ఒక పథకం ప్రకారం, అతని స్నేహితులైన (A2-చిట్టే పృద్విరాజ్
మరియు A3-బండ్ల శివ) ల సహకారంతో
హత్య
చేయడం జరిగింది.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నెల్లూరు జిల్లా అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారి
ఆదేశాల మేరకు గూడూరు డి.యస్.పి. శ్రీ రాజగోపాల్ రెడ్డి గారి అద్వర్యంలో గూడూరు అర్బన్ CI శ్రీమతి
నాగేశ్వరమ్మ గారు మరియు రూరల్ CI శ్రీ శ్రీనివాస రెడ్డి గార్లు కేసును కూలంకుషంగా పరిశీలించి,
చేధించడం జరిగినది. ఈ సందర్భంగా కేసు వివరాలు తెలుపుతూ A1 తండ్రి చెంచు కృష్ణయ్య మరియు
తేజస్విని తండ్రి సుధాకర్ లు సుమారు 7 సంవత్సరాల క్రితం ఒకే స్కూల్ నందు పని చేస్తూ స్నేహముగా
ఉండేవారు, తద్వారా ఆ పరిచయం వలన అప్పుడప్పుడు సుధాకర్ వాళ్ళ ఇంటికి A1 ముద్దాయి
పోతూ
వస్తూ ఉండేవాడు. ఆ కుటుంబ పరిచయంతో తేజస్వినికి దగ్గరై స్నేహంగా ఉండి అది 2 సంవత్సరాల
తరువాత ప్రేమగా మారి ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు, తరువాత కొద్ది రోజుల నుండి
మాట్లాడుకోకుండా ఉండడంతో, తన ఇష్టం లేకున్నా తన వెంటపడి వేదిస్తూ ఉండగా, తేజస్విని తల్లిదండ్రులు
గమనించి వారిని మందలించి కేసు పెడతామని హెచ్చరించగా A1 తండ్రి ఇంక అలా జరగదు అని
సర్దిచెప్పినట్లు, ఇంటికి వచ్చిన అనేక సార్లు తేజస్విని కొరకు వెతుకుతూ తన స్నేహితులతో చర్చించేవాడు.
లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రం హోం కనుక తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఎలాగైనా తేజస్వినిని కలవాలని,
తనకి దక్కనిది ఎవరికీ దక్కకూడదని కక్ష్యతో, తన స్నేహితుల సహకారంతో వెతుకుతూ ఉండేవారు. తేది 01. న ముగ్గురూ కలసి తేజస్విని ఇంటి వద్ద రక్కీ నిర్వహించి తల్లిదండ్రులు స్కూల్ కి వెళ్ళిన
తరువాత A2 ముద్దాయి 11.30 గంటల ప్రాంతములో అపార్ట్ మెంట్ లోనికి వెళ్ళి తేజస్విని ఫోన్ నంబర్
అడుగగా, తను ఇవ్వను అనడంతో ఇంతలో A1 ముద్దాయి ఇంటిలోని ప్రవేశించి బలవంతంగా తేజస్వినిని
బెడ్ రూమ్ లోకి లాక్కొని వెళ్లి బోల్ట్ వేసి ఆమె గుంతు నులిమి, కత్తితో మెడపై కోసి మరియు పొడిచి, టవల్
తో మెడకు గట్టిగా బిగించి చంపి వేసినట్లు, కొద్దిసేపటికి తేజస్విని చనిపోయినట్లు నిర్ధారించుకొని, తరువాత
అక్కడికి పోలీసులు, చుట్టు ప్రక్కల వాళ్ళు వచ్చి తలుపులు తట్టుతూ, పగులు గోట్టుచూ ఉండగా A1
ముద్దాయి భయపడి కుర్చీ లో ఉన్న ఫ్యాంట్ ను సీలింగ్ ఫ్యాన్ కు కట్టి దానితో కుదరక అక్కడ ఉన్న చీరతో
ఉరి వేసుకున్నట్లు నటించాలని ప్రయతించినట్లు, వారు తలుపులు పగులగొట్టి లోపలి వచ్చి A1 ముద్దాయి,
తేజస్విని ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని పోయినారు. తేజస్విని చనిపోయినట్లు డాక్టర్ లు
చెప్పినారు, A1 ముద్దాయికి ప్రదమ చికిత్స చేసి నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు పంపినారు. కేసును
మధ్యవర్తుల సహకారంతో ముద్దాయిలని అరెస్టు చేసి, ముద్దాయి హత్యకు ఉపయోగించిన బైకు, కత్తిను మరియు
3 మొబైల్స్ స్వాధీనచేసుకోవడమైనది.
ఈ కేసును చేధించుటలో కీలక పాత్ర వహించిన గూడూరు డి.యస్.పి.
గారు, గూడూరు అర్బన్
CI శ్రీమతి నాగేశ్వరమ్మ గారు మరియు రూరల్ CI శ్రీ శ్రీనివాస రెడ్డి గారు, SI లు ఆదిలక్ష్మీ, బ్రహ్మనాయుడు,
HC రాజు, మోహన్, ఆదినారాయణ, నాగరాజు,
రాము లను అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారు అభినందించి
రివార్డులు అందజేసినారు.

  • http://www.sgstvtelugu.com/రాశి-ఫలాలు/నిత్య-పంచాంగ-నేటి-రాశి-ఫల/
Total Page Visits: 145 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed