SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

కార్పోరేషన్ పదవుల భర్తీపై జగన్ ఫోకస్… ఆరోజే ప్రకటన!

1 min read


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… రాష్ట్రంలోని కార్పోరేషన్ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టారు. వైఎస్ జయంతి సందర్భంగా ఈ నెల 8వ తేదీన జాబితా ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి


కొన్నింటిపై కసరత్తు కొలిక్కి
మరికొన్నింటిపై కుదరని సమీకరణాలు
8న ప్రకటిస్తారని వైసీపీ వర్గాల వెల్లడి

రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్‌ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవులను ప్రభుత్వం త్వరలో భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నెల 8వ తేదీన నియామకాలపై ప్రకటన చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కొన్ని కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లు, డైరెక్టర్ల పేర్లపై ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ మరికొన్ని సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లకు సంబంధించి కులాల సయోధ్య కుదరలేదని సమాచారం.
నిజానికి సీఎం వద్ద జాబితా ఆమోదం పొందిన వెంటనే సోమవారం నాడే పదవులను ప్రకటించాలని అనుకున్నారు. ఆమోదం పొందిన కార్పొరేషన్ల వరకైనా ప్రకటించాలన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. అయితే అన్ని కార్పొరేషన్లనూ ఒకేసారి ప్రకటించాలని సీఎం జగన్‌ స్పష్టం చేయడంతో జాబితా విడుదల చేయలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పదవులన్నీ సుమారు 80 వరకూ ఉంటాయని భావించినా.. 73 వరకూ లెక్క తేలాయని చెబుతున్నారు. జగన్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ జయంతి రోజునే వీటన్నింటిని ప్రకటిస్తారని తెలుస్తోంది.

Total Page Visits: 85 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed