SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

కార్గిల్ అమరవీరులకు జొహార్లు ఘనంగా కార్గిల్ విజయ దినొత్సవం

1 min read

ఒంగోలు: కార్గిల్ విజయోత్సవమును ఘనంగా నిర్వహించి, అమర వీరులకు నివాళులు అర్పించిన ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు మరియు వాసవిపరివార్ ఇంటర్నేషనల్ ప్రకాశం జిల్లా సభ్యులు.

సోమవారం సాయంత్రం ఒంగోలు బండ్లమిట్ట లోగల కార్గిల్ స్థూపం వద్దకు ర్యాలిగా వచ్చి కొవ్వొత్తి దీపాలను వెలిగించారు.

21సంవత్సరాల క్రితం మనదేశ భూ భాగంలోనికి దొంగచాటుగ ప్రవేశించి, కాశ్మీర్ లోని అత్యంత ఎత్తైన కొండలలో, విపరీతమైన చలి ప్రదేశం అయిన లఢక్ ప్రాంతం ఆక్రమించిన ఉగ్రదేశం పాకిస్తాన్ సైనికులు. వారిని తరిమి కొట్టడానికి వీరులైన మన దేశ సైనికులు అరవై రోజులపాటు యుద్దం చేసి, ప్రాణాలను తృణ ప్రాయంగా భావించి దేశం కొరకు, దేశంలొ చొరబడిన ఉగ్ర పాక్ సైనికులను తుద ముట్టించుటలో 527మంది మన భారత సైనికులు అమరులైనారు. వారి త్యాగాలను మననం చేసుకొంటూ ఘన నివాళులు అర్పించిచారు.

ఈ సందర్భముగా భారత సైనికులు చూపిన తెగువను స్ఫూర్తిగ తీసుకొని ప్రతి కుటుంబం నుండి ఒక్కరైనా సైన్యంలో చేరాలనే భావన కలిగించుటకు యువత ముందుకు రావాలని కోరారు ఆలిండియా మహాత్మా సోషల్ క్లబ్ జాతీయ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం ప్రజలకు పిలుపునిచ్చారు.

కార్యక్రమములో ఎయిమ్స్ క్లబ్ అధ్యక్షులు తుమ్మపూడి బుచ్చిబాబు, కార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, ధనిశెట్టి రాము, శెనెగెపల్లి నాగాంజనేయులు, మరియు వాసవి పరివార్ ఇంటర్నేషనల్ ప్రకాశం జిల్లా గౌరవాధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం, చాలువాది బాల సుబ్రహ్మణ్యం,
సుధా శ్రీనివాసరావు, మహేష్.
కఠారి సుధాకర్ యాదవ్, సాయి, బసవయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Also read

Total Page Visits: 144 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed