SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఎన్నికల ఒప్పందంలో భాగం గా ఈ డ్రామాలు…. దేవినేని ఉమా

1 min read

విజయవాడ, ‘‘రెండు రాష్ట్ర ప్రభుత్వాలది మూర్ఖత్వం. తెలివి తక్కువ తనం. బాధ్యతా రాహిత్యం. ‘నువ్వు కొట్టినట్టు ఉండాలి… నేను ఏడ్చినట్టు ఉండాలి’ అనే సామెతగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యవహారం ఉంది. ఎన్నికల ఒప్పందంలో భాగం గా ఈ డ్రామాలు జరుగుతున్నాయి. అక్కడ మంత్రులు మాట్లాడుతుంటే జగన్మోహన్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు?’’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. శుక్రవారం విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నదిలో నీటిని ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నారుమళ్లకు వెళ్లవలసిన నీటిని సముద్రంలోకి వదలటానికి జగన్‌రెడ్డికి మనస్సు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. 40 ఏళ్ల అనుభవానికి, ఒక తెలివి తక్కువ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదని అన్నారు 200 టీఎంసీల అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నా జగన్‌ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే లక్షల కోట్లు ఖర్చుపెట్టి పక్క రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లు తీసుకువస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.

Total Page Visits: 146 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed