SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరొచ్చు: అశోక్‌బాబు

1 min read


అమరావతి: పంచాయతీరాజ్ శాఖాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ తనపరిధి దాటి మాట్లాడారని తెలుగుదేశం ఎమ్మెల్సీ పీ.అశోక్ బాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై, అధికారపార్టీపై అంతటి మోజుంటే.. ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరొచ్చని అశోక్‌బాబు ఎద్దేవా చేశారు.కాంగ్రెస్‌ హయాంలోనే ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్‌ తవ్వకాలకు బీజం పడిందని చెప్పారు. వైఎస్సార్ హయాంలో అనుమతులు పొందిన వారినే టీడీపీ ప్రభుత్వం కొనసాగించిందన్నారు. హైకోర్టు చెప్పిందంటూ ఏం తవ్వుతున్నారో తెలుసుకోకుండా జగన్‌ ప్రభుత్వం అనుమతులిచ్చిందని తెలిపారు.

లక్ష్మణరావు సాధారణ గిరిజనుడు, అంత భారీస్థాయిలో బాక్సైట్ తవ్వకాలు జరిపే శక్తిలేదన్నారు.అతని వెనుకాల ఉన్న రాజకీయ ప్రముఖులెవరో ద్వివేదీకి తెలియకపోయినా, మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డికి బాగా తెలుసునని చెప్పారు.ఏ ఖనిజం ఉందో తెలియాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం కోర్టుకు చెప్పిందన్నారు. నేరుగా లక్ష్మణరావు పేరుతో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఎలాఇచ్చింది? అని ప్రశ్నించారు. అండ్రూ మినరల్స్ అనే కంపెనీ గతంలో వైసీపీకి రూ.11 కోట్ల ఫండ్ ఇచ్చిందని అశోక్‌బాబు తెలిపారు.

Total Page Visits: 112 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed