SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఈముఖ్యమంత్రికి కాపుల పేరుఉచ్ఛరించే అర్హతకూడా లేదు.
డాక్టర్ నిమ్మల రామానాయుడు

1 min read

*పశ్చిమగోదావరి జిల్లా (పాలకొల్లు)*

_*టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, టీడీఎల్పీ ఉపనేత, డాక్టర్ నిమ్మల రామానాయుడు విలేకరుల సమావేశం వివరాలు..*_

*కాపు కార్పొరేషన్ నిర్వీర్యం, కాపురిజర్వేషన్ల నిలుపుదలతో జగన్మోహన్ రెడ్డి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను నిలువునా వంచించి, వారిదృష్టిలో జగన్మోసపు రెడ్డిగా మిగిలాడు.*

*- జగన్మోహన్ రెడ్డి కాపులకు ఇచ్చినహామీలన్ని తుంగలోతొక్కి వారిదృష్టిలో జగన్మోసపు రెడ్డిగా మిగిలాడు.*

*- కాపు కార్పొరేషన్ కు ఏటా రూ.2వేలకోట్ల చొప్పున, ఐదేళ్లలో రూ.10వేలకోట్లు ఇస్తానన్న జగన్ హామీ ఏమైంది?*

*- వై.ఎస్సార్.చేయూత పేరుతో 45ఏళ్లు పైబడిన కాపుమహిళలకు ఏటా రూ.15వేలుఇస్తాననిచెప్పి వారిని మోసగించాడు.*

*- కాపుసంక్షేమంపేరుతో రాష్ట్రంలో కోటి50లక్షలమంది కాపులుంటే, కేవలం 3లక్షలమందికే కాపునేస్తం అమలుచేసి, మిగిలినవారికి వెన్నుపోటు పొడిచాడు.*

*- బ్రిటీషు వారు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లను నీలం సంజీవరెడ్డి, కాసుబ్రహ్మనందరెడ్డి రద్దుచేశారు.*

*- చంద్రబాబునాయుడు తిరిగి వాటిని పునరుద్ధరిస్తే, జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని నిలిపేశాడు.*

*- చంద్రబాబునాయుడు కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి, విదేశాలకువెళ్లి చదువుకునే కాపుయువతకు రూ.10లక్షలనుంచి రూ.15లక్షలవరకు ఆర్థికసాయం చేశాడు.*

*- కాపు యువత స్వయంఉపాధికి రూ.2లక్షలనుంచి రూ.5లక్షలవరకు రుణాలు అందించాడు.*

*- ప్రతిజిల్లాలో కాపుభవన్ ల నిర్మాణానికి రూ.2కోట్లనుంచి రూ.5కోట్లవరకు కేటాయించాడు.*

*- ఈవిధంగా చంద్రబాబునాయుడు తనహాయాంలో కాపులకు అనేకరకాలుగా అండదండలు అందించాడు.*

*- జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక కాపు , తెలగ, బలిజ, ఒంటరి కులాలను ఆటలో అరటిపండ్లలా వాడుకొని వదిలేశాడు.*

*- కాపులకు తీరని అన్యాయంచేసిన జగన్మోహన్ రెడ్డి ఆయావర్గాలదృష్టిలో పచ్చిదగా, మోసపు రెడ్డి గా మిగిలిపోయాడు.*

*- కాపుల పేరుఉచ్ఛరించే అర్హతకూడా జగన్మోహన్ రెడ్డికిలేదు.*

★ జగన్మోహన్ రెడ్డి ప్రజలకుఇస్తున్న సంక్షేమపథకాలన్నీ రంగురంగుల ప్రకటనలకే పరిమితమయ్యాయని, కాపుల సంక్షేమం గురించి జగన్ మాట్లాడుతుంటే, రావణాసురుడు రామాయణం చెప్పినట్లుగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఎద్దేవాచేశారు.

★ గురువారం ఆయన జూమ్ ద్వారా తన నివాసం నుంచి విలేకరులతో మాట్లాడారు.

_*ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!*_

★ రాష్ట్రంలో కాపులకు ద్రోహం, పెద్దమోసం జరిగిందంటే అది జగన్ పాలనలోనే.

★ ప్రతిపక్షంలోఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కోటి50లక్షలమంది కాపులున్నారనిచెప్పి, నేడు కేవలం 3లక్షలమందికి మాత్రమే కాపునేస్తం పథకం అమలుచేయడం ఆయనచేసిన ద్రోహం, దగా కాదా?

★ జగన్మోహన్ రెడ్డి కాపుమోసంప్రక్రియ నిరంతరాయంగా సాగుతూనే ఉంది.

★ బ్రిటీష్ హాయాంలోకాపులకు రిజర్వేషన్లుఇస్తే, నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యాక వాటిని తొలగించారు.

★ తరువాత ఉమ్మడిరాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య దళితుడైనప్పటికీ కాపుల రిజర్వేష్లనను తిరిగి పునరుద్ధరించారు. కానీ తరువాత ముఖ్యమంత్రి అయిన కాసు బ్రహ్మనందరెడ్డి మరలా కాపుల రిజర్వేషన్లు రద్దుచేశాడు.

★ ఆతరువాత చంద్రబాబునాయుడు విభజనానంతర ఏపీకి ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి కాపువర్గానికి రిజర్వేషన్లు అమలుచేశాడని, ఆయనచేసేవరకు అంతకు ముందున్న ఏముఖ్యమంత్రీ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచనేచేయలేదు.

★ కాపుల రిజర్వేషన్లు రద్దుచేసిన వ్యక్తులుగా, ఆవర్గానికి తీరని అన్యాయంచేసి వారిదృష్టిలో ద్రోహులుగా మిగిలింది నీలంసంజీవరెడ్డి, కాసు బ్రహ్మనందరెడ్డి, వై. ఎస్. జగన్మోహన్ రెడ్డిలే.

★ ఈమాట నేను అనడంకాదు, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులంతా ఇదే అనుకుంటున్నారు.

★ కాపుయువత విద్యోన్నతికోసం, కాపుల సంక్షేమంకోసం గతంలో ఎవరూ చేయనివిధంగా చంద్రబాబు నాయుడు కాపుకార్పొరేషన్ ఏర్పాటుచేశాడు.

★ పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో కాపుకార్పొరేషన్ కు సంవత్సరానికి రూ.2వేలకోట్లచొప్పున, ఐదేళ్లకు రూ.10వేలకోట్లు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు.

★ రెండేళ్లకుముందు ఇచ్చినహామీని తుంగలో తొక్కడమే కాకుండా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక కాపు కార్పొరేషనేలేకుండా చేశాడు.

★ కాపు కార్పొరేషన్ లేకుండా చేసి, ఆవర్గానికితీరని అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి కాపులద్రోహికాడా?

★ కాపులకు తీరని అన్యాయంచేస్తూ, ఎవరూచేయని విధంగా సంక్షేమం అమలుచేస్తున్నామని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు.

★ అమ్మఒడి, రైతుభరోసా, వాహన మిత్ర ఇతరత్రాపథకాలను అన్నివర్గాలకు ఇచ్చినట్లే అరకొరగా ఇస్తూ, ఆసాయాన్ని కూడా కాపులసంక్షేమం కిందలెక్కకట్టడం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పచ్చిమోసం కాదా?

★ సంక్షేమపథకాలనేవి రాష్ట్రంలోని ప్రతిపేదవాడికి అందుతాయి.

★ పేదల్లో కాపుల కూడాఉంటారు. కానీ పేదలకు అమలుచేసే పథకాలను వర్గాలవారీగా విభజించి, కాపులకు ఇవిచేశాం… మరోవర్గానికి అవిచేశామని చెప్పుకుంటున్న దిక్కుమాలిన ముఖ్యమంత్రిని ఇప్పుడేచూస్తున్నాం.

★ భవిష్యత్ లో పోలవరం ప్రాజెక్ట్ గానీ పూర్తయితే, దానికింద లబ్ధిపొందే కాపురైతులను కూడా లెక్కకట్టి, ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ. 50వేలకోట్లయిందికాబట్టి, దానివల్ల సగానికిపైగా లబ్ధికాపు రైతులకే అందుతుందికాబట్టి, వారికి రూ.25వేలకోట్ల వరకు సాయం చేశామని చెప్పుకోవడానికి కూడా ఈ నీతిమాలిన ముఖ్యమంత్రి వెనుకాడడు.

★ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందిచ్చిన మేనిఫెస్టోలోనే కాపుకార్పొరేషన్ కు ఏటా రూ. 2వేలకోట్లచొప్పున, ఐదేళ్లకురూ. 10వేలకోట్లు ఇస్తానన్నాడు. మరి ఆ మేనిఫెస్టోలో చెప్పింది నేడు ఎందుకుఅమలు చేయలేకపోయాడు.

★ అదే మేనిఫెస్టోలో 45ఏళ్లు నిండిన ప్రతిమహిళకు వైఎస్సార్ చేయూతపథకంకింద సంవత్సరానికి రూ.15వేలు ఇస్తాననికూడా ఈ జగన్మోసపు రెడ్డి చెప్పాడు.

★ రూ.15వేలు ఇస్తానన్న హామీతోపాటు, కాపు కార్పొరేషన్ కు ఇస్తానన్న నిధులనుకూడా ఈ ముఖ్యమంత్రి ఎగ్గొట్టాడు.

★ రాష్ట్రంలోఅతికొద్దిమందికి చేయూత అమలుచేసి, దాన్నే గొప్పగాచెప్పుకుంటున్నారు.

★ కాపు కార్పొరేషన్ లేకుండా చేసిన ముఖ్యమంత్రి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల్లోని పేదలను రోడ్లపాలుచేసి, కాపుల ద్రోహిగా మిగిలాడు.

★ కాపుల్లోఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లలు విదేశాలకువెళ్లి చదువుకునేలా ఒక్కొక్కరికీ రూ.10 లక్షలనుంచి రూ.15లక్షలవరకు విదేశీ విద్యాదీవెన పథకం కింద చంద్రబాబునాయుడు అందించారు.

★ ఆపథకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తుంగలోతొక్కాడు.

★ ఆవిధంగా కాపుయువతకుతీరని ద్రోహంచేసిన వ్యక్తిగా ముందువరుసలో నిలిచాడు.

★ కాపువర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంకోసం, ఉన్నతచదువులు చదువుకునేయువతకు, పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే ఆయావర్గంలోని యువతకు నెలకు రూ.18వేలచొప్పున, ఒక్కో విద్యార్థికి రూ.2లక్షల40వేలుచొప్పున గతప్రభుత్వం కాపువిద్యోన్నతి పథకం కింద అందించింది.

★ జగన్ అధికారంలోకి వచ్చాక ఆపథకం ఎక్కడుందోకూడా తెలియని పరిస్థితి.

★ కాపువర్గంలో పెద్దగా చదువుకోని యువతఉపాధి కోసం కాపుకార్పొరేషన్ కింద స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను చంద్రబాబునాయుడు నిర్వహించాడు.

★ వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి లేకుండాచేశాడు.

★ కాపుకార్పొరేషన్ ద్వారా టీడీపీప్రభుత్వం కాపుయువతకు చిన్న, మధ్యతరహా పరిశ్ర మలు ఏర్పాటుచేసుకోవడానికి రూ.10లక్షలవరకు ఎలాంటి వడ్డీలేకుండా రుణాలు అందించింది.

★ కనిష్టంగా రూ.10లక్షలు, గరిష్టంగా రూ.25లక్షలరుణం అందించిన ఘనత చంద్రబాబునాయుడికే దక్కింది.

★ అదేవిధంగా ప్రతిజిల్లాలోనూ కాపుకార్పొరేషన్ ద్వారా రూ.2కోట్లనుంచి రూ.5కోట్ల వ్య యంతో కాపుభవన్ లనిర్మాణాన్ని టీడీపీప్రభుత్వం చేపడితే, వాటిని కూడా జగన్మోసపు రెడ్డి నిలిపేశాడు.

★ రాయలసీమలో ని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీసీటు ఎప్పుడూ అక్కడిప్రధానవర్గమైన బలిజలకే ఇచ్చేవారు.

★ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ రాజంపేటఎంపీ స్థానం బలిజవర్గానికే దక్కుతుంది.

★ అలాంటి పార్లమెంట్ సీటుని కూడా జగన్మోహన్ రెడ్డి తనవర్గానికి చెందిన మిథున్ రెడ్డికి కట్టబెట్టాడు.

★ బలిజలకు తీరని అన్యాయంచేసి, వారికిదక్కాల్సిన ఎంపీ పదవిని తనవర్గానికి ఇచ్చుకున్న జగన్మోసపు రెడ్డి కాపులద్రోహి కాకఏమవుతాడు.

★ ఈముఖ్యమంత్రికి కాపుల పేరుఉచ్ఛరించే అర్హతకూడా లేదు.

★ కాపుకార్పొరేషన్ ను నిర్వీర్యంచేసి, ఆవర్గంలోని యువత, మహిళలు, వృద్ధులకు జగన్మోహన్ రెడ్డిచేయరాని ద్రోహంచేశాడు.

★ అలాంటి వ్యక్తి కాపులకు సంక్షేమంచేస్తున్నాడంటే ఎవరైనా నమ్ముతారా?

★ జగన్మోహన్ రెడ్డి జమానాలో కాపులు అన్నివిధాలా వంచన కుగురవుతున్నారనడంలో ఎలాంటిసందేహంలేదు.

★ కోటి 50లక్షల మంది కాపులురాష్ట్రంలోఉంటే, కేవలం 3లక్షల మందికి కాపునేస్తం అమలుచేసి, అదేదోపెద్ద ఘనకార్యమైనట్లు ఈ ముఖ్యమంత్రి చెప్పుకోవడం సిగ్గుచేటు.

★ టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడే కాపుల్లోని నేతలంతా రాజకీయంగా ఉన్నతస్థానాలకుఎదిగారు.

★ బండారు రత్న, మెంటే పద్మావతి, చేగొండి హరిరామజోగయ్య, డీ.కే.ఆదికేశవుల నాయుడు, సీ.రామచంద్రయ్య, ముద్రగడ పద్మనాభం, పసుపులేటి బ్రహ్మయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి ఎంతో మంది కాపునేతలకు రాజకీయంగా అవకాశం కల్పించింది టీడీపీప్రభుత్వాలే.

★ చంద్రబాబునాయుడి హాయాంలో టీడీపీ రాష్ట్రఅధ్యక్షుడిగా కాపునేత పనిచేశారు.

★ ఉపముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు కాపులకుఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ కూడా కాపులకే ఇచ్చారు.

★ తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవినికూడా చంద్రబాబునాయుడు బలిజవర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చారు.

★ ఈ విధంగా ఎన్టీఆర్ నుంచి చంద్ర బాబునాయుడి వరకు రాష్ట్రంలో కాపువర్గానికే అధిక ప్రాధాన్యతఇచ్చారు.. ఇస్తున్నారు.

★ కాపు, తెలగ, బలిజ , ఒంటరికులాలకు టీడీపీప్రభుత్వంలో జరిగినంత మేలు, మరే ప్రభుత్వంలోనూ జరగలేదని గుండెలపై చేయి వేసుకొని చెప్పగలను.

★ చంద్రబాబునాయుడు విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నప్పుడే ఎస్వీ విశ్వవిద్యాలయం విద్యార్థిసంఘ నాయకుడిగా బలిజవర్గానికి చెందిన అంతిరాజ్ మోహన్ ని నియమించారు.

★ ఈ విధంగా రాష్ట్ర చరిత్రలో కాపు, తెలగ, బలిజ, ఒంటరికులాలకు న్యాయం చేసింది చంద్రబాబు, స్వర్గీయ ఎన్టీఆర్ లైతే, కాపుల ద్రోహులుగా నీలం సంజీవరెడ్డి, కాసుబ్రహ్మనందరెడ్డి, జగన్మోహన్ రెడ్లే నిలిచిపోతారని ప్రతి కాపువ్యక్తి గుర్తించాలి.

Also read

Total Page Visits: 123 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed