SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఇది అసెంబ్లీనా, గొడ్ల చావిడా.. : బాలకృష్ణ ఫైర్

1 min read

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై వైసిపి నేతలు వ్యక్తిగత దూషణలకు దిగడంపై హిందూపురం ఎమ్మెల్యే, ఆమె సోదరుడు బాలకృష్ణ స్పందించారు. వైసిపి నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సజావుగా సాగాల్సిన అసెంబ్లీ.. ప్రజల దృష్టిని మర్చలేందుకు, దాన్నే అజెండాగా తీసుకుని.. మహిళలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని అన్నారు. ఎన్నడూ చంద్రబాబు నాయుడు కంటితడి పెట్టలేదని అన్నారు. అసెంబ్లీలో ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేయడం సహజమేనని, సమస్యలపై పరిష్కరించడంపై మాట్లాడకుండా.. వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని అన్నారు. వారి చేసే వ్యాఖ్యలు, చేష్టలు గొడ్ల చావిట్లో ఉన్నామన్న అన్న సందేహం కలిగిందని అన్నారు. రాజకీయాలతో సంబంధాలు లేని, ఓ వ్యాపార వేత్త అయిన తన సోదరిపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని తెలిపారు.
ఇంత నీచమైన వ్యాఖ్యలు ఎన్నడూ చూడలేదన్న బాలకృష్ణ… అసెంబ్లీలో చాలా హుందాగా వ్యవహరించాలని సూచించారు. మీ సంస్కృతిని మార్చుకోవాలని.. తాను సూచించడం లేదని, మీరు మారకపోతే.. మెడలు వంచుతామని అన్నారు. మంగళగిరిలో దాడి చేశారని గుర్తు చేశారు. పదవులనేవి శాశ్వతంగా ఉండదని, ప్రజలు మీ పాలన చూస్తున్నారని, వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. మీరు నోరు అదుపులోకి పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఈసారి ఇటువంటి వ్యాఖ్యలకు పాల్పడితే సహించేది లేదని అన్నారు. భువనేశ్వరి మరో సోదరి మాట్లాడుతూ.. తాను తొలిసారిగా మీడియా ముందు మాట్లాడుతున్నానని, తాము వైసిపి కుటుంబాన్ని ఎన్నడూ కూడా పల్లెత్తు మాట అనలేదని, కానీ తమ కుటుంబంపై ఇటువంటి దూషణలకు దిగడం సరికాదని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు రిపీట్‌ చేయకుండా ఉంటే మంచిదని అన్నారు. జరుగుతున్న అరాచకాలకు జనమే సమాధానం చెప్పాలి. నోటితో కాదు.. ఓటుతోనే సమాధానం చెప్పాలి అంటూ అంతకముందు బాలకృష్ణ ట్వీట్‌ చేశారు.

Also read

Total Page Visits: 236 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed