SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఆనందయ్య మందు పంపిణి విజయవంతం

1 min read


*సనాతన ఆయుర్వేద వైద్యులు, కరోనా నివారణ మందు రూపకర్త ఆనందయ్యకు “ఆయుర్వేద శిరోరత్న” గా బిరుదు ప్రకటించిన ఎయిమ్స్ క్లబ్ జాతీయ అధ్యక్షులు*

*ఆనందయ్యకు పద్మ పురస్కార ప్రదానానికై ప్రభుత్వానికి ఎయిమ్స్ క్లబ్స్ విన్నపం*


ఒంగోలు: ఆలిండియా మహాత్మా సోషల్ క్లబ్ ఒంగోలు మరియు వాసవి పరివార్ ఇంటర్నేషనల్ ప్రకాశం ఒంగోలు శాఖల ఆధ్వర్యములో కరోనా వైరస్ నివారణకు కృష్ణపట్నం బొనిగె ఆనందయ్య సనాతన ఆయుర్వేద మందు పంపిణిచేశారు.

ఒంగోలు లోని గాంధీరోడ్డు, దక్షిణం బజారులో శ్రీ సంపత్కుమార ఆర్యవైశ్య కళ్యాణ మండపం లో జరిగిన కార్యక్రమమునకు ముఖ్య అతిధులుగ ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ ఆత్మీయ కుప్పం ప్రసాదు మరియు నగర కార్పోరేషన్ డిప్యూటి మేయర్ ఆత్మీయ వేమూరి సూర్యనారాయణ, వాసవిక్లబ్స్ జిల్లా పూర్వ గవర్నర్ వల్లంపట్ల మురళికృష్ణ విచ్చేశారు.

సభావేదికపై శ్రీ వాసవికన్యకా పరమేశ్వరి దేవి, పూజ్య బాపూజి చిత్రపటాలకు పూలమాలాంకృతం చేశారు.

ఆయుర్వేద మందు పంపిణి కార్యక్రమమునకు ముందుగా గాంధీరోడ్డు గ్రామ చావడి వద్దగల పూజ్య బాపూజి విగ్రహమునకు ముఖ్య అతిధులు పూల మాలాంకృతం చేసి జోహార్లు అర్పించారు. అనంతరం క్లబ్ సభ్యులచే ముందుగా ప్రజలకు చేర్చబడిన వెయ్యి కూపన్ల ద్వారా పది కేజీల ఆనందయ్య మందును పేకట్ల ద్వారా ప్రజలకు పంపిణి చేశారు.

ఈ సందర్భముగా ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ మాట్లాడుచూ కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి ఎందరినో మృత్యుముఖానికి చేర్చిందని, అట్టి విపత్కర పరిస్థితులలో అమరజీవి పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మన సనాతన హిందూ వైద్య ప్రక్రియలో కరోనా నివారణ మందు తయారు చేశారని ఆ మందు తీసుకోవడం వలన ప్రజలలో రోగనిరోధక శక్తి పెంచిందని, ఆత్మ స్థైర్యం తో కరోనాను ఎదిరించే శరీర అంతర్గత శక్తి ఏర్పడిందని తెలిపారు. ఆనందయ్య మందును ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు, వాసవిపరివార్ ఇంటర్నేషనల్ సంస్థల కార్యవర్గ సభ్యులు సేకరించి ప్రజలకు ఉచితంగా అందించడం హర్షణీయమని తెలిపారు. క్లబ్ సభ్యులకు పేరుపేరున అభినందించారు.

నగర కార్పోరేషన్ డిప్యూటి మేయర్ వేమూరి సూర్యనారాయణ మాట్లాడుచూ… ఎంతో విలువైన పది కేజీల సనాతన ఆయుర్వేద ఆనందయ్య మందును సేకరించి ప్రజారోగ్య రక్షణకై ప్రజలకు మందు పంపిణి చేయడం వీరి సేవాతత్పరతకు నిదర్శనమని ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు, వాసవి పరివార్ ప్రకాశం సభ్యులకు అభినందనలు తెలిపారు.

ప్రజలకు ఆరోగ్యంతో ఆనందాన్ని అందించే ఆనందయ్య మందు ప్రజలకు దొరకడం దృల్లభమైన సమయంలో సామాజిక సంస్థలు ఎయిమ్స్ క్లబ్స్, వాసవి పరివార్ సంస్ధలు ప్రజలకు అందించడం హర్షణీయమని వల్లంపట్ల మురళికృష్ణ తెలిపారు.

ఎయిమ్స్ క్లబ్స్ జాతీయ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం అధ్యక్షతన జరిగిన ఆనందయ్య మందు కార్యక్రమములో వాసవిపరివార్ ప్రకాశం గౌరవాధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాసరావు, ఎయిమ్స్ క్లబ్ అధ్యక్షులు తుమ్మపూడి బుచ్చిబాబు, ఎయిమ్స్ క్లబ్ సింగరాయకొండ అధ్యక్షులు అచ్చుత చెంచు సుబ్బారావు, కార్యదర్శి పబ్బిశెట్టి శ్రీనివాసరావు, ఎయిమ్స్ క్లబ్ వనిత యం. ఉమాదేవి, జూనియర్ క్లబ్ ముదిగొండ మీనాక్షి, మీనాశ్రీలు మరియు ధనిశెట్టి రాము, శెనెగెపల్లి నాగాంజనేయులు, చలువాది సత్యనారాయణ, చామర్తి రవిచంద్ర, సిహెచ్. గోవిందరాజులు, కనమర్లపూడి శివనారాయణ, బెల్లంకొండ శ్రీనివాసరావు, పద్మనాభుని రామనారాయణ, శివ, గుర్రం కృష్ణ, గుర్రం బదరినారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఎయిమ్స్ క్లబ్ జాతీయ అధ్యక్షులు రాధా రమణ గుప్తా మీడియాతో మాట్లాడుచూ సనాతన ఆయుర్వేద మందును ప్రజలకు అందించిన కృష్ణపట్నం ఆనందయ్య గారికి ఈ సందర్భముగా “ఆయుర్వేద శిరోరత్న” గ బిరుదును ప్రదానం చేస్తున్నామని, త్వరలో వారిని కలసి ధన్యవాదములు తెలుపుతామని, అంతేకాక మా ఆలిండియా మహాత్మా సోషల్ క్లబ్స్ తరపున ప్రజలలో కరోనా భయాన్ని పోగొట్టి, ప్రపంచం అంతా భారత్ వైపు, సనాతన ఆయుర్వేదం వైపు చూసే విధంగా చేసిన ఆనందయ్య గారికి పద్మ పురస్కారం అందిచమని ప్రభుత్వానికి మి నిర్ణయమును మీడియా తెలిపారు. మందు పంపిణికి సహకరించిన దాతలకు సభాముఖంగా ధన్యవాదములు తెలిపారు.

Total Page Visits: 182 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed