SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అహర్నిశలు శ్రమిస్తున్న పాత్రికేయులకు చేయూత కార్యక్రమం. *”నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు

1 min read

సమాజ ప్రగతిలో జర్నలిస్టుల పాత్ర
అమోఘం,ప్రశంసనీయం.
ఆర్థిక ప్రయోజనాల కంటే సామాజిక ప్రయోజనాల కోసం
అహర్నిశలు శ్రమిస్తున్న పాత్రికేయులకు చేయూత కార్యక్రమం. *”నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివ ప్రసాద్ గారు.”*

*ఈ రోజు అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి గారి భర్త గారైన,నేనుసైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుసిరెడ్డి శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో అరకు నియోజక వర్గంలో అరకులోయ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ గారి అధ్యక్షతన పాత్రికేయ మిత్రులకు సుమారు 70 మందికి 25 కేజీల బియ్యం, కేజీ ఆయిల్ ప్యాకెట్,కందిపప్పు,పెసరపప్పు, శనగపప్పు,గోధుమ నూక, ఇడ్లీ నూక,సబ్బు,సర్ఫ్ తదితర సరుకులు పంపిణీ కార్యక్రమం.*
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…*
కరోనా సమయం నుండి నేను సైతం చారిటబుల్ పౌండేషన్ తరపున ఎన్నో
సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.
అరకు ఎంపీ దంపతులకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కరోనా సమయంలో పాత్రికేయ మిత్రులను ఆదుకోవడం మంచి విషయమన్నారు.
రాబోయే రోజుల్లో కూడా తాము కూడా సహకరిస్తామన్నారు.
*అనంతరం శివప్రసాద్ గారు మాట్లాడుతూ…”*
మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు గొడ్డేటి దేముడు గారి ఆశయాలకు అనుగుణంగానే సేవా కార్యక్రమాలు చేపడుతున్నమన్నారు.
సమాజ ప్రగతిలో విలేకరుల పాత్ర అమోఘమని, ప్రశంసనీయమని అన్నారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రాణాలు సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినా మీడియా ప్రతినిధులను నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేయూతనాదించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ సభ్యులు,శేఖర్,సురేష్ పట్నాయక్,పృథ్వి, గౌరీ,నాయుడు మాజీ సర్పంచులు,విలేకరులు తదితరులు పాల్గొన్నారు.

Total Page Visits: 182 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed