SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అర్థరాత్రి దేవినేని ఉమా అరెస్ట్‌..!

1 min read

(జి.కొండూరు) అమరావతి : జి.కొండూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తతల నడుమ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును బుధవారం వేకువజామున 1.15 గంటలకు పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా తవ్వకాలు జరిపిన ప్రాంతాలను పరిశీలించేందుకు ఉమా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైసిపి నేతలు ఈ అక్రమ తవ్వకాలను చేపడుతున్నారని, నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలోకి వెళ్లాయి. గడ్డమణుగు వద్ద వైసిపి కార్యకర్తలు కాచుకొని ఉన్నారని తెలుసుకున్న పోలీసులు… దేవినేని ఉమాను డొంకరోడ్డులో జి.కొండూరుకు తీసుకెళ్లారు. అది తెలిసిన వైసిపి వర్గం రోడ్డుపైకి చేరుకుని టిడిపి నేతల వాహనాలపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఓ టిడిపి నాయకుడి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఉమా కారు అద్దాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. పోలీసుల భద్రత నడుమ టిడిపి నేతల వాహనాలన్నీ జి.కొండూరు స్టేషను సమీపానికి చేరుకున్నాయి.

ఈ ఘటనతో టిడిపి-వైసిపి వర్గీయుల మధ్య ఘర్షణ భగ్గుమంది. వైసిపి నేత ఒకరు స్టేషను వద్దకు చేరుకుని స్థానిక ఎమ్మెల్యే వసంత కఅష్ణప్రసాద్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో టిడిపి వర్గీయులు ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. అతడి కారు అద్దాలను పగలగొట్టారు. వెంటనే పోలీసులు ఆ వైసిపి నేతను అక్కడి నుండి పంపేశారు.
దేవినేని ఉమాను అరెస్టు చేశారన్న విషయం తెలిసి టిడిపి వర్గీయులంతా జి.కొండూరు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. రోడ్డుపైనే బైఠాయించి నిరసన చేపట్టారు. ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్‌ చేశారు. ఇంతలో… ఎమ్మెల్యే కఅష్ణప్రసాద్‌ పోలీసుస్టేషను వద్దకు బయలుదేరారు. ఆయన కారును ఇబ్రహీంపట్నం కూడలివద్ద పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపేశారు.
పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తతల నడుమ దేవినేని ఉమా కారును స్టేషన్‌కు అరకిలో మీటరు దూరంలోనే ఆపేశారు. తాను ఫిర్యాదు ఇచ్చిన తర్వాతే వెళతానని ఉమా చెప్పడంతో పోలీసులు అక్కడి నుండి ఉమా కారును తొలగించేందుకు ప్రయత్నించారు. క్రేన్‌ను తెప్పించి వాహనాన్ని తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. నిన్న రాత్రి 7 గంటల నుండి ఉమా కారులోనే ఉన్నారు. కారు అద్దాలను తొలిగించి డోర్‌ను తీసి ఈరోజు వేకువజామున 1.15 గంటలకు దేవినేని ఉమాను పోలీసులు అరెస్టు చేశారు.
ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిని అరెస్టు చేయడమేంటి అంటూ… మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.

డిజిపి, కృష్ణా జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలి..
‘నాపై దాడి జరిగిన చాలా సేపటి వరకు పోలీసులు రాలేదు. పెద్దసంఖ్యలో వైసిపి కార్యకర్తలు వచ్చి రాళ్లు రువ్వారు. ఇది పూర్తిగా సిఎం జగన్‌, సజ్జల నాయకత్వంలోనే జరిగింది. దీనికి ఇద్దరూ బాధ్యత వహించాలి. కొండపల్లి రిజర్వు అడవిలో రూ.లక్షల విలువైన గ్రావెల్‌ దోపిడీ జరిగింది. దానిపై ప్రశ్నిస్తే చంపేస్తామంటున్నారు. ఈ ఘటన రాష్ట్రంలోని శాంతి, భద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది. దీనికి డిజిపి, కఅష్ణా జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలి’.
– దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి

అలజడి సృష్టించేందుకే అలా వెళ్లారు..
ఉమా అరెస్టు అనంతరం విజయవాడ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో కఅష్ణా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌, ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహనరావు మీడియాతో మాట్లాడుతూ.. ఉమా కుట్రపూరితంగా, ముందస్తు పథకంలో భాగంగా అలజడి సఅష్టించేందుకే అక్కడికి వెళ్లారని వ్యాఖ్యానించారు. ఏ సెక్షన్‌ కింద, ఎంతమంది మీద కేసు నమోదు చేసిందీ తర్వాత వెల్లడిస్తామన్నారు.

దేవినేని ఉమా విష ప్రచారం చేస్తున్నారు…
కొండపల్లి ప్రాంతంలో అనుమతులు ఇప్పించింది ఉమానే అని… అప్పుడు అవి రెవెన్యూ భూములని చెప్పి ప్రారంభోత్సవాలు చేసి, వాటిని అటవీ భూములని అంటున్నారనివైసిపి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్‌ ఆరోపించారు. ప్రశాంతమైన మైలవరం నియోజకవర్గంలో ఘర్షణలు, అల్లర్లను ప్రేరేపించేందుకు తనపై, ప్రభుత్వంపై దేవినేని ఉమా విష ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Also read

నిందితులు రోడ్డు మీద, బాధితులు పోలీసు కస్టడీలోనా : ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు

Total Page Visits: 140 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed