SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అప్పుల బాధ తాళలేక సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి ….

1 min read



అప్పుల బాధ తాళలేక సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి చెందిన ఘటన కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిథిలో చోటుచేసుకుంది .
ఘటనకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి .
కంచరపాలెం దుర్గా నగర్ ప్రాంతానికి చెందిన దున్న వెంకటరావు ( 28 ) మూడు సంవత్సరాల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. నగరంలో ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నాడు .
ఈక్రమంలో సోమవారం రాత్రి తన గదిలో నిద్రిస్తున్న వెంకటరావు మంగళవారం ఉదయం ఎంత సేపటికి బయటకి రాకపోవటంతో అతడి కుటుంబీకులు వెంకటరావు గదిలోకి వెళ్లి చూసేసరికి గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందినట్లు గుర్తించారు . దింతో వెంకటరావు తండ్రి అప్పలరాజు కంచరపాలెం పోలీసు లకు పిర్యాదు చేసారు .
పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కంచరపాలెం పోలీసు లు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమిక్షించారు . మృత దేహన్ని పోస్టు మార్టం నిమిత్తం కేజి .హెచ్ కు తరలించి దర్యాప్తు చేపట్టారు .

Total Page Visits: 67 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed