శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం
చైత్ర బహుళ ఏకాదశి చందన సాన ముహూర్తం

1 min read

సింహాచలం – శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం
చైత్ర బహుళ ఏకాదశి చందన సాన ముహూర్తం
దేవాలయంలో వేకువజామునే సుప్రభాత సేవ, ఆరాధన, మంగళాశాసనం అనంతరం పూర్వాచారం ప్రకారం భాండాగారంలో భద్రపరిచిన చందనం చెక్కలను తీసి… వైదిక సంప్రదాయం ప్రకారం బేడా మండపం చుట్టూ తిరిగి చందన సాన దగ్గర విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన కార్యక్రమం జరిగింది. అనతరం చందన సాన ముహూర్తం ప్రధాన అర్చకులు గోపాల కృష్ణమాచార్యులు జరిపారు. గంధం అరగదీత సంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది.
చందనం తీసే కార్యక్రమాన్ని ఈఓ సూర్యకళగారు , స్థానాచార్యులు డా. రాజగోపాలాచార్యులు గారు, అలంకారి సీతారామాచార్యులు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం ఐదారు రోజులపాటు కొనసాగనుంది. ప్రతిరోజు… ఉదయం 5 గంటల నుంచి చందనం తీయబడను.
ఈ నెల 14న స్వామివారి నిజరూప దర్శనం జరిగిన తర్వాత – సహస్రఘట్టాభిషేకం జరగును. తర్వాత స్వామివారికి మూడు మణుగుల చందన సమర్పణ జరుగును. వైశాఖ పౌర్ణమినాడు రెండో విడత, జేష్ట పౌర్ణమినాడు మూడో విడత, ఆషాడ పౌర్ణమినాడు నాలుగో విడత చందన సమర్పణ చేస్తారు.

Total Page Visits: 29 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed