లక్ష్మీ పంచమి

1 min read

లక్ష్మీ పంచమి

🔔లక్ష్మీ పంచమి🔔
🚩🚩

సామాన్యంగా చాలా పూజలను, వ్రతాలను
నక్షత్రం ఆధారంగా లేదా తిధులు ఆధారంగా జరుపుతారు.

లక్ష్మీ పంచమి వ్రతం
తిధి ఆధారంగా పంచమి రోజున చేస్తారు.
లక్ష్మీ దేవి పూజ అయినందున
దీనిని శ్రీ వ్రతం అని ,
శ్రీ పంచమి
అని అంటారు.
చైత్రమాసంలో శుక్లపక్ష పంచమి తిధినాడు
ఈ వ్రతం ఆచరిస్తారు.
భక్తి శ్రధ్ధలతోళఈ వ్రతం చేసినందువలన
వ్యాపారాభివృధ్ధి, మంచి అంతస్తు కలిగి కుటుంబంలో లేమి అనేది లేకుండా సుభిక్షంగా వుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కుటుంబంలో
ఐక్యత, నూతన గృహాలు, వాహనాలు
మొదలైన శుభాలు కలుగుతాయని పురాణ గ్రంధాలు తెలుపుతున్నాయి.

శ్రీ లక్ష్మీ అనుగ్రహం లేనివారు అధఃపాతాళంలోకి
త్రోయబడినట్టే.
మనసులో సందేహాలు, తలపెట్టిన పనులలో అపజయం, కలుగుతూ వుంటాయి. అందుకే శ్రీ లక్ష్మీ ని కటాక్షం ముఖ్యం.
అందుకే వ్యాపారస్తులు తమ కళ్ళెదురుగా
లక్ష్మీదేవి చిత్రపటం, లక్ష్మీదేవి యంత్రం పెట్టి వాటికి కుంకమ దిద్ది అలంకరణలతో పూజిస్తారు. గృహాలలో కూడా లక్ష్మీ దేవిని
ఆహ్వానిస్తూ గడపలకి పసుపు కుంకాలు పెట్టి ఒక దీపం పెట్టడం ఆచారం.
శుభాలనిచ్చే లక్ష్మీ దేవిని పంచమినాడు
పూజించడమే
శ్రీ పంచమి వ్రతం యొక్క ధ్యేయం.

ఈ లక్ష్మీ దేవిని
నవరాత్రి, దీపావళి, శుక్రవారం, శ్రావణ
శుక్రవారం వంటి పర్వదినాలు కూడా లక్ష్మీ పూజకి
విశిష్టమైనవి.

పూజ నాటి ప్రాతః కాలమునే లేచి , గృహాన్ని శుభ్రం చేసి
పూజాగదిలో పీటను అమర్చి ముగ్గువేసి, కలశం పెట్టి లక్ష్మీదేవి మంత్రంతో దేవిని
ఆవాహనం చేయాలి.
లక్ష్మీ గాయత్రీ మంత్రాన్ని
భక్తితో ఉచ్ఛారణా దోషోలు,తప్పులు లేకుండా చదివి,
మహాలక్ష్మీ దేవిని
ఆహ్వానించాలి.
ఆ కలశానికి వస్త్రం ,అభరణాలు పుష్పాలు
సమర్పించాలి.
” ఓం శ్రీం హ్రీం క్లీం కుబేరాయ
నమః” అనే లక్ష్మీ కుబేర
మంత్రాన్ని 108 సార్లు
జపించాలి. ఒక పూట ఉపవాసం చేసి , సాయంకాలం
అనేక రకాల పళ్ళతో నైవేద్యం పెట్టి
నిష్టతో
దీపారాధన చేయాలి.
తరువాత ఉపవాసాన్ని ముగించాలి. ఆనాడు లక్ష్మీదేవి శ్రీ సూక్త పారాయణం, విష్ణసహస్రనామ
పారాయణం, కనకధారా స్తోత్రం, లక్ష్మీ సహస్రనామ పారాయణం జరిపించడం శుభప్రదం.
(ఇవి వేదపండితులను తీసుకు వచ్చి చేయాలి).
తర్వాత మీకు తెలిసిన స్తోత్రాలు, పాటలు పాడి పూజ సంపూర్ణం చేయవచ్చు.

శ్రీ కృష్ణ జయంతికి మన పిల్లలకి కృష్ణుని అలంకారం చేసి కృష్ణుని గా భావించినట్టు,
మనింటి అమ్మాయిలకు లక్ష్మీదేవి అలంకారం చేసి, వారితో
కలసి పూజ చేయాలి.
ఉదయాన ఉపవాసం చేసి సాయంకాలం లక్ష్మీ దేవి పూజ చేయాలి. ఈ పూజల వలన అప్పుల భాధ వుండదు. వ్యాపారాలలో
నష్టాలు కలిగేవారు పూజచేయడమే కాకుండా
వరుసగా ఐదు గురువారాలు
లక్ష్మీ మంత్రం పఠించి
కుబేరదీపం వెలిగించి ,
పూజలు చేస్తే ఆర్థిక పరిస్థితి
మెరుగవుతుంది. ఆనాడు
ముఖ్యంగా రెండు మూడు రకాల
తీపి పిండివంటలు చేసి
నివేదించడం ముఖ్యం.
లక్ష్మీ దేవిని భక్తి శ్రధ్ధలతో
పూజించండి. సకల
ఐశ్వర్యాలు లభిస్తాయి.

🚩🚩సేకరణ:వేదుల జనార్ధన రావు 🙏

Total Page Visits: 58 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed