సింహాచలం: ఇకపై దర్శనాలు 2 గంటలే

1 min read


సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామిని... శుక్రవారం (07-05-21) నుంచి రోజూ ఉదయం 7:30 నుంచి 9:30 మధ్య భక్తులు దర్శించుకోవచ్చు. రెవెన్యూ - దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి గారి ఆదేశాలమేరకు ... ఈ నిర్ణయం తీసుకోవడమైనది. రోజుకు గరిష్టంగా రెండు గంటలకన్నా ఎక్కువ సమయం భక్తులకు - ఆలయంలోకి అనుమతించొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. భక్తుల సౌకర్యార్థం ఉదయం 7:30 నుంచి 9:30 వరకు అనుమతించబడును. కోవిడ్ ప్రొటోకాల్ ను పూర్తి స్థాయిలో పాటిస్తూ... ఈ రెండు గంటల సమయంలోనే శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకోవాలని ఆలయ ఈఓ , అధికారులు విజ్ఞప్తి చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు... ఈ రెండు గంటల నియమం అమల్లోఉంటుంది.

సింహాచలం
ఈ నెల 10 , 12 తేదీల్లో జరగాల్సిన శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి హుండీ లెక్కింపును వాయిదా వేయడమైనది. లెక్కింపు తేదీలను తర్వాత ప్రకటించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.

Total Page Visits: 62 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed