రెమ్‌డెసివిర్‌ అక్రమంగా విక్రయం..అరెస్టు

1 min read

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో అక్రమంగా రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆరు ఇంజెక్షన్లు, రూ.2.40లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తెనాలిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న వ్యక్తుల ద్వారా ఇంజెక్షన్లను బాధితులకు అధిక ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించామని డీఎస్పీ స్రవంతిరాయ్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీ నుంచి వీటిని తెప్పించి ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.40 వేలకు విక్రయిస్తున్నారని చెప్పారు. డెకాయ్‌ ఆపరేషన్‌ ద్వారా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

Total Page Visits: 41 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed