SGS TV Telugu

24×7 News

హైదరాబాద్‌ జూ పార్క్‌: 8 సింహాలకు కోవిడ్‌ లక్షణాలు

1 min read


హైదరాబాద్‌: కరోనా సెంకడ్‌ వేవ్‌తో కోవిడ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా కాలంలో తమ పెంపుడు జంతువులకు ఎంతో మంది మాస్క్‌లు పెట్టిన వార్తలు విన్నాం. అయితే ఇప్పటివరకు కరోనా లక్షణాలు మనుషుల్లో మాత్రమే కనిపించాయి. జంతువులకు కరోనా వచ్చినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ కోవిడ్‌ వైరస్‌ లక్షణాలు తాజాగా జంతువుల్లో కూడా కనిపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూవాలాజికల్ పార్క్‌లోని 8 సింహాలకు కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు జూ సిబ్బంది గుర్తించారు.

Total Page Visits: 12 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *