సి సీ కెమెరాతో జర్నలిస్టు కుమార్తెకు వేధింపులు

1 min read

పోలీసులకు యువతి ఫిర్యాదు..కేసు నమోదు
బంజారాహిల్స్‌ : అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ ఎదురుగా సీసీ కెమెరా బిగించి దివంగత జర్నలిస్టు కుమార్తెను వేధింపులకు గురిచేస్తున్న కుటుంబంపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సీనియర్‌ జర్నలిస్టు జి.కృష్ణయ్య కుమార్తె రోహిణి జర్నలిస్టు కాలనీలోని సాయికృప అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న శ్రీనివాసరెడ్డి, ఆయన భార్య సులోచన రెడ్డి, కుమార్తె సహజ రెడ్డి కొద్ది రోజులుగా ఆమెను వేధించడం మొదలుపెట్టారు. వాచ్‌మన్‌ కుమారుడితో కొన్ని వీడియోలు తీయించి వాటిని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తామంటూ బెదిరించారు. అంతేకాకుండా రోహిణి ఉండే ఫ్లాట్‌ ముందర సీసీ కెమెరా పెట్టించారు. ఈ విషయాల గురించి అడిగితే దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు శ్రీనివా‌స్‌రెడ్డి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Total Page Visits: 85 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed