SGS TV Telugu

24×7 News

మానవత్వం చాటుకున్న తాండూర్ సి.ఐ

1 min read

—రామగుండం పోలీస్ కమిషనరేట్— *//మంచిర్యాల జిల్లా//*

పత్రికా ప్రకటన

తేదీ:-01-05-2021

♦️ మానవత్వం చాటుకున్న తాండూర్ సి.ఐ గారు

🔹 ఆదివాసీలకు అండగా నిలిచిన సి.ఐ బాబు రావు గారు

🔹 సొంత ఖర్చులతో నీటి సమస్య పరిష్కారానికి కృషి

♦️ ప్రజల బాగోగుల కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది: తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్(సి.ఐ) బాబు రావు గారు ---వివరాల్లోకి వెళ్తే---

👉 తాండూర్ పోలీస్ సర్కిల్ పరిధిలోని…అబ్బాపూర్ గ్రామంలో తాగడానికి,ఇతర అవసరాలకు నీళ్లు లేకుండా,నీటి సమస్యతో బాధబపడుతూ…అక్కడి గ్రామ ప్రజలందరు తాండూర్ సి.ఐ బాబు రావు గారి దృష్టికి తీసుకెళ్లగా…

✍️ సి.ఐ గారు వెంటనే స్పందించి,నిన్న 30వ తేదీన,శుక్రవారం నాడు,అబ్బాపూర్ గ్రామాన్ని సందర్శించి,గ్రామ ప్రజలతో నీటి కొరత గురించి మాట్లాడి,సమస్యను ఒక బాధ్యతగా తీసుకుని,గ్రామనికి అర కిలోమీటర్ల దూరంలో ఉన్న బావి లో పూడికను తీయించి,నీరు నిల్వ అయ్యేలా చర్యలు చెప్పటి,సి.ఐ గారి సొంత ఖర్చులతో మోటార్ అందజేసి,అక్కడి బావి నుండి ఊరిలోకి పైప్ లైన్ వేయించి గ్రామ ప్రజల దప్పికను తీర్చి సి.ఐ బాబు రావు గారు మానవత్వం చాటుకున్నారు.

👉 ఈ సందర్భంగా సి.ఐ గారు మాట్లాడుతూ…పోలీసులు కేవలం కేసులను చేధించడమే పని కాకుండా,ప్రజల శ్రేయస్సు,వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ తరుపున ఎల్లప్పుడూ కృషి చేస్తామని సి.ఐ గారు తెలిపారు.

👉 సి.ఐ గారి ఎనలేని కృషికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ…సి.ఐ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

👉 మరియు పోలీస్ పై అధికారుల నుండి సి.ఐ బాబు రావు గారు అభినందనలు పొందారు.

Total Page Visits: 50 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *