SGS TV Telugu

24×7 News

భారీ మోసం: సెలైన్‌ నింపి వ్యాక్సిన్‌గా బురిడీ

1 min read

నిజామాబాద్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో ప్రజలందరూ వ్యాక్సిన్‌ వేసుకునేందుకు తొందర పడుతున్నారు. దీంతో ఒక్కసారిగా వ్యాక్సిన్‌లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. కోవిడ్‌ నుంచి రక్షించుకునేందుకు వ్యాక్సిన్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అదునుగా చేసుకుని కొందరు మోసగాళ్లు క్యాష్‌ చేసుకున్నారు. తాజాగా ఖాళీ రెమిడెసివర్‌ బాటిల్స్‌లో సెలైన్‌ వాటర్‌ నింపి వ్యాక్సిన్‌గా విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్‌లో వైద్యుడు, ఓ కాంపౌండర్‌ కలిసి ఈ భారీ మోసానికి పాల్పడుతున్నారు. బాధితుల నుంచి భారీగా నగదు తీసుకుని ఈ నకిలీ వ్యాక్సిన్‌ అమ్ముతున్నారు. ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకువచ్చారు. 

నిజామాబాద్‌కు చెందిన రంజిత్ కుమార్ తన అన్నయ్య మహేశ్‌ బాబు కరోనా బారిన పడ్డాడు. అతడికి వ్యాక్సిన్‌ కోసం ఆర్మూర్‌కు చెందిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడు సాయినాథ్‌ను సంప్రదించాడు. ఆయన రెమిడిసివర్‌ వ్యాక్సిన్‌ ఇచ్చాడు. అయితే వాస్తవ రెమిడిసివర్‌కు ఇది తేడాగా ఉందని గుర్తించాడు. వెంటనే నిజామాబాద్‌ పట్టణ-1 పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వ

Total Page Visits: 77 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *