బంగారం దుకాణంలో చోరీ చేసిన వ్యక్తి అరేస్ట్

1 min read

హైదరాబాద్/చందానగర్‌: బంగారం దుకాణం చోరీ కేసును చందానగర్‌ పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి మూడున్నర తులాల బంగారు నగలు, వెండి వస్తువులు, రూ. 35 వేలు, నాలుగు కార్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా, బూత్‌పూర్‌ గ్రామానికి చెందిన సయ్యద్‌ మహబూబ్‌పాషా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 8వ తేదీ రాత్రి తారానగర్‌ తుల్జాభవానీ ఆలయ సమీపంలోగల రెహన్‌ జువెలరీ షాపు షట్టర్‌ తాళాలు పగులగొట్టి 15 తులాల బంగారు నగలు, వెండి వస్తువులు, రూ. 3.50 లక్షలు దోచుకున్నాడు. మంగళవారం ఉదయం గుల్‌మొహర్‌పార్కు చౌరస్తావద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు.

అటువైపు వచ్చిన సయ్యద్‌పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి నుంచి మూడున్నర తులాల నగలు, వెండి వస్తువులు, రూ. 35 వేలు, నాలుగు కార్లు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై చందానగర్‌, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి తదితర పోలీస్‌స్టేషన్లలో 15 దొంగతనాల కేసులున్నాయని డీసీపీ తెలిపారు. కుషాయిగూడ, వనపర్తి స్టేషన్లలో అతడిపై పీడీ యాక్ట్‌ నమోదైంది. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో మియాపూర్‌ ఏసీపీ కృష్ణప్రసాద్‌, చందానగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కాస్ట్రో, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేష్ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Total Page Visits: 19 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed