SGS TV Telugu

24×7 News

పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు’ సేవల నిలిపివేత

1 min read

రెజిమెంటల్‌బజార్‌,కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్రంలోని 14 పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రా(పీవోపీఎస్‌కే)ల్లో ఈ నెల 14 వరకు పాస్‌పోర్టు సేవలను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారు ఈ నెల 17 తర్వాత వాటిని రీషెడ్యూల్‌ చేసుకోవచ్చని సూచించారు. గతంలో మూడు సార్లు ఎటువంటి అదనపు ఫీజు లేకుండా రీషెడ్యూల్‌ చేసుకునే వెసులుబాటు ఉండగా.. ఇప్పుడు ఎన్నిసార్లైనా చేసుకునే వీలు కల్పించినట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో, పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, పాస్‌పోర్టు సేవా లఘు కేంద్రాల్లోనూ రీషెడ్యూల్‌ చేసుకునే అవకాశముందని తెలిపారు. హైదరాబాద్‌లోని బేగంపేట్‌, అమీర్‌పేట్‌, టోలిచౌకి, నిజామాబాద్‌లోని పాస్‌పోర్టు సేవా కేంద్రాలతోపాటు కరీంనగర్‌లోని లఘు కేంద్రంలో స్లాట్‌లను ఇప్పటికే 50 శాతానికి తగ్గించినట్లు తెలిపారు.

Total Page Visits: 54 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *