పెళ్లికి ఒప్పుకొలేదని ప్రేయసిని హత్యచేసిన యువకుడు

1 min read

మద్యంమత్తులో మృతదేహం సమీపంలోనే నిద్ర

ఆపై తానేచంపానంటూ పోలీసులకు సమాచారం..

నాగార్జునసాగర్‌,: ఆ అబ్బాయి, అమ్మాయిది 45 రోజుల పరిచయం… ప్రేమ! అది ప్రియుడి ఉన్మాదంతో విషాదాంతమైంది. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో బీర్‌ బాటిల్‌తో గొంతులో పొడిచి.. బండరాయితో తలపై కొట్టి ఆమెను హత్యచేశాడు. మద్యంమత్తులో మృతదేహం పక్కనే హాయిగా నిద్రపోయి లేచి.. తానే చంపానంటూ దారిన వెళుతున్న పోలీసులకు తాపీగా చెప్పాడు. శుక్రవారం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌ హిల్‌కాలనీ సమీపంలో ఈ ఘటన జరిగింది. గుర్రంపోడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన వెలుగు అంజయ్య, రాములమ్మ దంపతుల చిన్న కుమార్తె చందన (20) ఇంటర్‌ దాకా చదివి కూలి పనులకు వెళుతోంది. అనుముల మండలం కొరివేనిగూడేనికి చెందిన బొడ్డు శంకర్‌ ఇంటర్‌ చదివి వరికోత మిషన్‌ నడుపుతున్నాడు. 45 రోజుల క్రితం గుర్రంపోడు మండలంలో వరికోతలకు శంకర్‌ బొల్లారం వెళ్లాడు. 

ఆ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. రోజూ కలుసుకునేవారు. ఇద్దరూ పెళ్లి గురించి మాట్లాడుకునేందుకు శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై సాగర్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో హిల్‌కాలనీ రెండో డౌన్‌ వద్ద శివం హోటల్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. వెంట తెచ్చుకున్న మద్యాన్ని శంకర్‌ తాగాడు. అనంతరం ఇద్దరూ కలిసి భోజనం చేశారు. శంకర్‌ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా చందన నిరాకరించింది. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో అక్కడే ఉన్న ఖాళీ బీరు బాటిల్‌ను పగలగొట్టి చందన గొంతులో పొడిచి, బండరాయితో తలపై మోదడంతో ఆమె మృతి చెందింది. మద్యం మత్తులో ఉన్న శంకర్‌ అక్కడే చెట్టుకింద నిద్రించి, సాయంత్రం నిద్రలేచి ప్రధాన రహదారిపైకి చేరుకున్నాడు. అటుగా వెళుతున్న పోలీసులు గమనించి ప్రశ్నించడంతో హత్య చేసిన విషయం వారికి చెప్పాడు.  వెంటనే ఎస్‌ఐకి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని చందన మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం

Total Page Visits: 54 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed