పెళ్లయిన రెండో రోజే ఆత్మహత్య
వివాహ దుస్తుల్లో అనూష

1 min read

సంస్థాన్‌నారాయణపురం, న్య కాళ్ల పారాణి ఆరనే లేదు. తోరణాలు వాడనే లేదు.. ఏమైందో తెలియదు కానీ నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం మర్రిబావితండాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మర్రిబావితండాకు చెందిన పుల్య-సాలి దంపతుల రెండో కూతురు సబావట్‌ అనూష(21)కి నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పెద్దవూరతండాకు చెందిన వరుడితో ఈ నెల 26న వధువు ఇంటి వద్ద వివాహం జరిగింది. 27న వరుడి ఇంట్లో వివాహ విందు నిర్వహించారు. అదే రోజు అర్ధరాత్రి కొత్త జంట మర్రిబావితండాకు వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం కొత్త పెళ్లికూతురు ఇంట్లో ఓ గదిలోకి వెళ్లింది. పెళ్లి అలసటతో నిద్రిస్తుందేమోనని అందరూ భావించారు. సాయంత్రం పిలిచినా తలుపులు తెరవక పోవడంతో వాటిని ధ్వంసం చేసి చూసే సరికి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి కనిపించింది. వివాహం జరిగి రెండు రోజులు గడవకముందే పెళ్లి కూతురు బలవన్మరణానికి పాల్పడటంతో స్థానికంగా విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై సుధాకర్‌రావు కేసు నమోదు చేసుకున్నారు. మృతికి కారణాలను ఆరా తీస్తున్నారు.

Total Page Visits: 139 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed