పంచవటి ఆసుపత్రిని సీజ్ చేయాలి;రాచాల యుగంధర్ గౌడ్

1 min read

వనపర్తి,
పిట్టల్లా రాలుతున్నా మానవత్వం లేని పంచవటి ఆస్పత్రిని సీజ్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రశ్నించే వారే కరువయ్యారని, ఇంత జరుగుతున్నా కూడా స్థానిక ఎమ్మెల్యే కనీసం ఆస్పత్రిని తనిఖీ చేయకపోవడం ఎంత వరకు సమంజసమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆదివారం నాడు భూత్పూర్ పట్టణంలోని వసుంధర కాంప్లెక్స్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాచాల మాట్లాడుతూ కోవిడ్ బాధితుల ప్రాణాలు పిట్టల్లా రాలుతున్నా… ఆసుపత్రి నిర్మాణం మొదలు నేటి వరకు పంచవటి ఆస్పత్రిపై పలు ఆరోపణలు ఉన్నా అధికారులు గాని నేతలుగాని ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
పి.హెచ్.సి లను తనిఖీ చేసే ఎమ్మెల్యేకు పంచవటి ఆస్పత్రి కనిపిస్త లేదా అని అన్నారు.
ఇంత జరుగుతున్నా పక్కనే వున్న పంచవటి ఆసుపత్రిని ఎందుకు తనిఖీ చేయడం లేదని ప్రశ్నించారు. పంచవటి ఆసుపత్రి అనుమతులు మొదలు ఆసుపత్రిలో రోగులకు చేస్తున్న వైద్యం, వసూలు చేస్తున్న బిల్లుల వరకు పూర్తిస్థాయిలో విచారణ చేయాలని రాచాల డిమాండ్ చేశారు.
సాక్షాత్తు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి తనిఖీ చేయాలని ఆదేశిస్తే మంత్రి శ్రీనివాస్ గౌడ్ వచ్చారని, మంత్రికి ఉన్న సమయం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డికి లేదా అని ప్రశ్నించారు.
గతంలో తన సొంత గ్రామంలో ఇసుక మాఫియా నడిపిస్తూ దాదాపు 1200 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా డంప్ చేస్తే విచారణ జరిపిన కలెక్టర్ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీనికి కారణం ఎవరో ప్రజలకు చెప్పాలన్నారు.
ఇప్పుడు కూడా ప్రజల ప్రాణాలు రాలిపోతుంటే అధికారులు,స్థానిక ఎమ్మెల్యే పట్టించుకుంటలేరని విమర్శించారు.ప్రజల ప్రాణాలంటే పట్టవా అని, ఎమ్మెల్యేకి తనిఖీచేసిన ధైర్యం లేకపోతే కనీసం వైద్యాధికారులైనా తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నించే వారిపై కేసులు పెట్టే అధికారులు ప్రాణాలు తీసే వారిపై పెట్టరా అని సూటిగా ప్రశ్నించారు.
ఇటీవల కోవిడ్ బాధితుల ఫిర్యాదులకు స్పందించిన ప్రభుత్వం కోవిడ్ సేవలను నిలిపివేసినట్లు సమాచారం వచ్చిందని, కానీ బాధిత కుటుంబాలకు చెల్లించిన బిల్లులు తిరిగి ఇప్పించి ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆసుపత్రిని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో పంచవటి బాధితులు రామారావు, వెంకట్రాములు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు అంజన్న యాదవ్, నక్క రాములు, మ్యాదరి రాజు పాల్గొన్నారు.
From
POLISHETTI BAALAKRISHNA
పవర్ దినపత్రిక
WANAPARTHY
పొలిశెట్టి బాలకృష్ణ
సీనియర్ విలేకరి

Total Page Visits: 21 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed