SGS TV Telugu

24×7 News

టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులలో 150 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత

1 min read

పత్రికా ప్రకటన

నారాయణపేట జిల్లా పోలీస్

తేదీ:02.05.2021

టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులలో 150 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత

మక్తల్ పోలీస్స్టేషన్ పరిధిలో లారీ డ్రైవర్ లంకలపల్లి పురుషోత్తం అమరచింత గ్రామం, వనపర్తి జిల్లా కి చెందిన వ్యక్తి ఈరోజు తెల్లవారుజామున లారీ నెంబర్ KA 34 7651 అనే లారీలో 150 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ ను రాయచూర్ నుండి దేవరకద్ర కు తీసుకు వెళ్తున్న సమయంలో మక్తల్ లోకల్లో నల్లజమ్మ టెంపుల్ దగ్గర టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా మక్తల్ ఎస్ఐ. రాములు గారు మాట్లాడుతూ డిటి గారి పంచనామా అనంతరం పురుషోత్తం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మక్తల్ పోలీస్స్టేషన్ పరిధిలో PDS రైస్ ను అమ్మిన అక్రమంగా రవాణా చేసిన, ఇళ్లలో నిల్వచేసిన అట్టి వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పి.ఆర్.ఓ.

ఎస్పి.కార్యాలయం

Total Page Visits: 7 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *