SGS TV Telugu

24×7 News

జర్నలిస్టులూ కరోనా వారియర్సే!

1 min read

హైదరాబాద్, అమరావతి:
కరోనా విపత్తు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రశ్నార్ధకంగా మారిన మీడియా రంగం సమస్యలు, వాటిల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టుల సమస్యలను ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ రెండో విడత ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించింది.

ఈ సందర్భంగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ సురేంద్ర బాబు మాట్లాడుతూ కరోనావైరస్ కష్టాలు మీడియా రంగాన్ని ఎలా ప్రభావితం చేశాయన్నది ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని, అయితే జర్నలిస్టులకు సంబంధించిన సంక్షేమ, బీమా రక్షణ వంటి కార్యక్రమాలు సక్రమంగా అమలుజరగడం లేదన్నారు. ‘‘కరోనా విపత్తు నేపథ్యంలో కూడా ప్రభుత్వం కనీసం వాటి పునరుద్దరణ, అమలుపై దృష్టిపెట్టని ఫలితం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న జర్నలిస్టులకు మరణశాపంగా మారిందన్నారు. సహజంగా ప్రతి పాత్రికేయుడు విధి నిర్వహణలో ముందుండాలని, తాను పనిచేస్తున్న సంస్థ ద్వారా ప్రజలకు నమ్మకమైన సమాచారాన్ని ముందుగా వార్తల రూపంలో అందించాలనే ఉద్దేశంతో పని చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలో అనేకమంది మిత్రులు ప్రాణాంతకమని తెలిసినా రిస్కు ఫేస్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో జర్నలిస్టు సోదరులు కరోనా వైరస్ బారిన పడటమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కరోనాపై ప్రత్యక్ష పోరులో మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే చాలా మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇతర రాష్ట్రాలలోనూ ఆ సంఖ్య భారీగానే ఉంది.’’ అని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన పథకం కింద 50 లక్షల కొవిడ్-19 బీమా సౌకర్యాన్ని పోలీసులకి, డాక్టర్లకు ఇచ్చిన విధంగానే జర్నలిస్టులకు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, జర్నలిస్టుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని, కరోనా వచ్చిన జర్నలిస్టులకు వైద్యం చేయించుకుంటున్న జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రెండు లక్ష రూపాయలు ఇవ్వాలని, కరోనా సమయంలో ప్రతి జర్నలిస్ట్‌కు నెలకి 20,000 ఆర్ధిక సహాయం అందించాలని సురేంద్ర బాబు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డుతో సంబంధం లేకుండా అన్ని సదుపాయాలను కల్పించాలని, మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్‌ కార్డులను కేవలం బస్ పాస్‌ల కోసమో, రైల్వే పాస్‌ల కోసమో ఇస్తున్నామన్న భావన నుంచి బయటకువచ్చి వాటి ద్వారా ఆయా ప్రతినిధులకు ఆర్ధిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ప్రకటించిన మాదిరిగా రిటైర్డ్ జర్నలిస్ట్‌లకు పెన్షన్ సదుపాయం కల్పించడంతో పాటు ప్రస్తుత కరోనా విపత్తు సమయంలో ఆర్ధిక ఆసరా కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

జర్నలిస్టుల సంక్షేమం రక్షణ అనే దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్య లక్ష్యంగా సీనియర్ జర్నలిస్టులు,ఉరకలెత్తే యువ జర్నలిస్టుల సహకారంతో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (N.A.R.A) ఆవిర్భవించింది..యూనియన్ ఆవిర్భావం నుంచి జర్నలిస్టుల కి దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్య లక్ష్యంగా కృషి చేస్తూ వస్తుంది. జర్నలిస్టులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి జర్నలిస్టు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల పై దాడులు అరికట్టడానికి జర్నలిస్టుల రక్షణ కోసం కఠిన చట్టాలు కావాలని అనే ప్రధాన డిమాండ్ల తో గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రజా ప్రతినిధులను, ఉన్నత అధికారులను కలిసి జర్నలిస్టుల హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేసింది..జర్నలిజం మూలాలను బ్రతికించి, జర్నలిస్టుల విలువను పెంచడానికి నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది…ఒకవైపు జర్నలిస్టుల సమస్యలపై జాతీయస్థాయిలో అలుపెరుగని పోరాటం చేస్తూ కూడా, ప్రకృతి వైపరీత్యాలు,కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సమాజ సేవలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ప్రధాన భూమిక పోషిస్తూ వస్తుందన్నారు సురేంద్ర బాబు..

కోవిడ్ – ఫస్ట్ వేవ్ లో జర్నలిస్టులకు,రోజువారి కూలి పని చేసుకునే పేద ప్రజలకు,పారిశుద్ధ్య కార్మికులకు,పోలీసులకు పూట గడవడం కష్టంగా ఉన్న తరుణంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ యూనియన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో యూనియన్ నాయకులు కూరగాయలు, బియ్యం, నిత్యవసర వస్తువులు,మాస్కులు,సానిటీజర్స్ పంపిణీ కార్యక్రమాలు చేశారు.వేసవి ఎండలను సైతం లెక్కచేయకుండా అత్యవసర సేవలు అందిస్తున్న జర్నలిస్టులకు, పోలీసులకు,పారిశుద్ధ్య కార్మికులకు,ఆర్టీసీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు,ఆహార పొట్లాలు, ఫ్రూట్స్ అందజేశారు..

అదే స్ఫూర్తితో కరోనా సెకండ్ వేవ్ లో కూడా కరోనా వైరస్ సమయంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు తమ వంతు సాయం అందించాలనే దృఢ సంకల్పముతో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా విపత్తులో భాగంగా జర్నలిస్టులకు శానిటైజర్లు,మాస్కులు,నిత్యావసర సరుకులును ప్రజా ప్రతినిధులు,అధికారులు,దాతల సహకారం తో పంపిణీ చేస్తామని జాతీయ అధ్యక్షులు సురేంద్రబాబు తెలిపారు.మరో రెండు మూడురోజుల్లో వర్కింగ్ జర్నలిస్టులకు దాతల సహకారంతో నిత్యవసర వస్తువులను,ఇతర సదుపాయాలను నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్పించనున్నామన్నారు..కరోనా వైరస్ సమయంలో న్యూస్ కవరేజ్ లో తమ ప్రాణాలను సైతం పక్కనపెట్టి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా సురేంద్ర బాబు జర్నలిస్టులకు సూచించారు.

Total Page Visits: 7 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *