SGS TV Telugu

24×7 News

జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం– జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు

1 min read

జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం– జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు …పూర్తి కోవిడ్ నిబంధనల మధ్య కౌంటింగ్
ఈ నెల మూడవ తేదీన జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు తెలిపారు.ఆదివారం అయన జడ్చర్ల డాక్టర్ బి ఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు.మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ లేకుండా కౌంటింగ్ సిబ్బంది ని కాని, బందోబస్తు సిబ్బంది ని కాని అభ్యర్థులు, కౌంటింగ్ ఎజెంట్లను కానీ, ఎవ్వరిని కౌంటింగ్ హాల్లోకి అనుమతించడం జరగదని కలెక్టర్ స్పష్టం చేశారు.ఏజంట్లకు పాసు తప్పని సరి అని కలెక్టర్ తెలిపారు.మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని హెల్త్ నోడల్ అధికారిగా నియమించడం జరిగిందని, కౌంటింగ్ హాలులోకి ప్రవేశించే వారు పూర్తిగా కోవిడ్ నిబంధనలను పాటించారని ఆయన ధృవపత్రం జారీ చేసిన తర్వాత నే కౌంటింగ్ హాల్లోకి అనుమతించడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బంది, అభ్యర్థులు, ఏన్- 95 మాస్కులు,ఫేస్ స్క్రీన్ ,సానిటైజర్ ప్రతి ఒక్కరికి తప్పనిసరి అని తెలిపారు . ఎన్నికల ఓట్ల లెక్కింపు కు 5 కౌంటింగ్ హాల్స్, 19 టేబుల్లు ఏర్పాటు చేశామని,పోలీస్ సిబ్బందితో కలుపుకొని మొత్తం 350 మంది కౌంటింగ్ లో పాల్గొంటున్నారని, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యంగా ఓట్ల లెక్కింపు కేంద్రం లోపల, బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాక వీడియో కెమెరా తో కూడా మొత్తం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను చిత్రీకరించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని ఆయన ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద అధికారులను ఆదేశించారు.జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ సునీత, తాసిల్దార్ లక్ష్మీనారాయణ ఉన్నారు…

Total Page Visits: 15 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *