SGS TV Telugu

24×7 News

కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం… భారీ దోపిడీ

1 min read


హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం రేగింది. ఏటీఎంలో డబ్బులు నింపుతున్న వారిపై దుండగుల కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డ్‌తోపాటు ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఇద్దరిపై కాల్పులు జరిపిన దుండగులు డబ్బులు దోచుకెళ్లారు. కాల్పుల్లో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయ పడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. దోపిడీకి పాల్పడ్డ నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. డబ్బులు నింపుతుండగా కాల్పులు జరిపారని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. కూకట్‌పల్లి హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.

Total Page Visits: 39 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *