SGS TV Telugu

24×7 News

కరోనా పట్ల ప్రజలు ఆధైర్య పడకండి… మీకోసం నేనున్నా

1 min read

సహస’చందర్’ డు
= ప్రాణం కంటే ప్రజల ఆర్యోగాలే ఆయన ముఖ్యం
= కొవిడ్ బాధితుల్లో ధైర్యం నింపిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు.
= ప్రజ సేవకే నా జీవితం అంకితం
=కరోనా పట్ల ప్రజలు ఆధైర్య పడకండి… మీకోసం నేనున్నా
= రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు

కారోనా విలయతండవం చేస్తున్న పరిస్థితులు… కరోనా అంటేనే భయంతో వణికిపోతున్న సందర్భం… తమ ప్రజల కోసం కోవిడ్ బారిన పడిన వారి ఆరోగ్య పరిస్థితులను తెలసుకునేందుకు ఎంతో ధైర్యంగా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కారోనా వార్డుల్లో మరో మారు సందర్శంచి సహస చందర్ డుగా నిలిచారు రామగుండం
ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు. కోవిడ్ వార్డుల్లో పిపి కిట్ ధరించి కోవిడ్ బాధితులను పరమర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను వైద్యుల నుండి తెలసుకున్నారు. మీ
ఆరోగ్యాల రక్షణ కోసం నెనున్నాంటూ వారిలో ధైర్యం నింపారు ఎమ్మెల్యే చందర్ గారు. గురువారం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌గారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రితో పాటు కారోనా వార్డులను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి
కేసీఆర్ గారు ప్రజలను కారోనా బారినుండి కపాడేందుకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. రామగుండం నియోజవర్గంలోని
కరోనా బాధితుల కోసం గతంలోనే 30 పడకల కోవిడ్ వార్డులను సిద్ధం చేశామని, కొవిడ్ బాధితులకు అన్ని రకాల వైద్య సదుపాయలను అందిస్తున్నామని తెలిపారు.
ప్రధానంగా ఆక్సిజన్ కు ఎలాంటి కోరత లేకుండా తగిన ఏర్పాటు చేశామన్నారు. కరోనా సెకండ్ వెవ్ పట్ల ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని, కారోనా నిర్ధారణ అయితే ఎలాంటి భయందోళనాలకు ప్రజలు గురి కావద్దన్నారు. డాక్టర్ల సలహాలు, సూచనాలు పాటిస్తు కరోనా నుండి కోలుకోవచ్చన్నారు. ప్రజలు మాస్కులు, సమాజీక దూరం, శానిటైజర్స్ తప్పకుండా వాడలన్నారు. రామగుండం ప్రజల సేవకే తన జీవితం అంకితమని, కరోనా పట్ల ప్రజల ఆధైర్య పడవద్దని మీ అందరికి అండగా నెన్నాంటనన్నారు.
ఎమ్మెల్యేగారి వెంట నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్ ఉన్నారు.

Total Page Visits: 16 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *