ఊరికి పోదాం.. ఉన్నదే తిందాం!

1 min read

ఊరికి పోదాం.. ఉన్నదే తిందాం!
లాక్‌డౌన్‌తో పట్నం వదిలి సొంతూళ్లకు తరలుతున్న ప్రజలు
పంతంగి టోల్‌ప్లాజా వద్ద పెరిగిన వాహన రద్దీ

చౌటుప్పల్‌; తెలంగాణ ప్రభుత్వం బుధవారం నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించడంతో భాగ్యనగరంలో ఉపాధి పొందుతున్న వారు మళ్లీ సొంతూరు బాట పట్టారు. రెండో దశలో కొవిడ్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటం, లాక్‌డౌన్‌ను మళ్లీమళ్లీ పొడిగిస్తూ పోతారనే అపోహల మధ్య ప్రైవేట్‌ ఉద్యోగులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, అడ్డా కూలీలు, చిరు వ్యాపారులు స్వగ్రామాలకు పయనమవుతున్నారు. మూటముల్లె సర్దుకొని పనికోసం పట్నం వచ్చిన వారంతా..మళ్లీ అవే సంచులతో వాహనాల్లో తిరిగి వెళ్తున్న దృశ్యాలు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద మంగళవారం నుంచి కుప్పలుతెప్పలుగా కనిపించాయి. మంగళవారం మధ్యాహ్నం లాక్‌డౌన్‌ ప్రకటన వెలువడిన అనంతరం అర్ధరాత్రి వరకు 12 వేలకు పైగా వాహనాలు వెళ్లినట్లు టోల్‌ప్లాజా అధికారులు అంచనా వేశారు.

Total Page Visits: 29 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed