ఆకాశంలో అద్భుతం.. రంగుల వలయంలో సూర్యుడు

1 min read

హైదరాబాద్ నగరంలో ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. బుధవారం మధ్యాహ్నం సూర్యుడి చుట్టూ ఓ రంగుల వలయం ఏర్పడింది. సూర్యుడిని కప్పేస్తూ ఇంద్రధనుస్సు తరహాలో రంగులు ఆవిష్కరించడంతో ఆకాశం రంగులద్దుకుంది. ఈ దృశ్యాన్ని చూడ్డానికి జనం నగరంలో పలు చోట్ల గుమిగూడారు. ఇక ఈ అద్భుత దృశ్యాన్ని చూసినవారందరు తమ కెమెరాలకు పనిచెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పలువురు ప్రముఖులు సైతం ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆకారంలో సూర్యుడు చాలా రేర్ గా కనిపిస్తాడని, సైంటిఫిక్ పరిభాషలో వీటిని “22-డిగ్రీ హలోస్” అని పిలుస్తారని పలువురు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బెంగుళూరులో కూడా ఇటువంటి అద్భుతమైన దృశ్యమే కనిపించిన విషయం విదితమే.

Total Page Visits: 123 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed