SGS TV Telugu

24×7 News

అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లు పట్టుకున్న బెజ్జుర్ పోలీసులు

1 min read

//కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా//

తేదీ:-01-05-2021

♦️ అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లు పట్టుకున్న బెజ్జుర్ పోలీసులు

👉 బెజ్జుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బారేగూడ గ్రామంలో శుక్రవారం రాత్రి అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను పట్టుకుని,వాటిని నిల్వ ఉంచిన వ్యక్తులను పట్టుకొని,వారి పై కేసు నమోదు చేసిన బెజ్జుర్ పోలీసులు. ---వివరాల్లోకి వెళ్తే---

✍️ మండలంలోని బారేగూడెం గ్రామానికి చెందిన కన్నెపెళ్లి పురుషోత్తం అనే వ్యక్తి,ఇంట్లో అక్రమంగా మద్యాన్ని నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించగా 7,300/- రూపాయల గల విలువ చేసే మద్యం పట్టుకోగా,అదేవిధంగా పోతేపల్లి గ్రామానికి చెందిన భాగ్య ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 6,750/- రూపాయల విలువ చేసే మద్యం పట్టుకున్నట్లు వారు తెలిపారు.

👉 ఇరువురి దగ్గర మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాగర్ గారు తెలిపారు.

✍️ ఈ సందర్భంగా ఎస్సై గారు మాట్లాడుతూ…గ్రామాలలో మద్యం అమ్మిన సరఫరా చేసిన అట్టి వారి పై చట్టపరమైన చర్యలు తప్పవని.

👉 ఈ దాడుల్లో ఎస్సై ఆసన్న మరియు పోలీస్ కానిస్టేబుళ్లు ప్రభు,వెంకటేష్ సిబ్బంది పాల్గొన్నారు.

Total Page Visits: 47 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *