SGS TV Telugu

24×7 News

అంకితభావంతో విధులు నిర్వహించాలి
-వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి

1 min read


అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజల నమ్మకాని పొందాలని వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీసులకు పిలుపునిచ్చారు.

వరంగల్ పోలీస్ కమిషనర్ గా భాధ్యతలు చేపట్టిన అనంతరం పోలీస్ కమిషనర్ తొలిసారిగా మడికొండ పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ రోజు ఉదయం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా సెంట్రల్ జొన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా, కాజీపేట్ ఎ.సి.పి రవీంద్రకుమార్, ఇన్స్‌పెక్టర్ రవికుమార్, సబ్-ఇన్స్‌పెక్టర్ నర్సింహరావుతో కల్సి స్టేషన్ పరిసరాలను పరిశీలంచారు. అనంతరం పొలీస్ స్టేషన్ రిసెప్షన్ కౌంటర్ పనితీరుకు సంబంధించిన వివరాలను సంబందిత విభాగం మహిళా కానిస్టేబుల్ ను పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పనితీరుతో పాటు స్టేషన్ లో నమోదయ్యే కేసులు మరియు అత్యధికంగా ఎలాంటి కేసులు నమోదు కాబడుతాయి. అధే విధంగా స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణతో పాటు, ప్రధాన రోడ్డు మార్గంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ రవికుమార్ ను పోలీస్ కమిషనర్ అడిగితెలుసుకున్నారు. ముఖ్యంగా విధుల్లో రాణించడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలందించించేందుకు రూపోందించబడిన వర్టికల్స్ విధానంపైసిబ్బంది మరింత అవగాహన పెంపోందించేందుకు అధికారులకు సిబ్బందికి శిక్షణ అందజేయాల్సి వుంటుందని. చివరగా పోలీస్ కమిషనర్ స్టేషన్ సిబ్బంది ముచ్చటించడంతో పాటు వారు నిర్వహించే ఎవిధమైన విధులు నిర్వహిస్తున్నారో పోలీస్ కమిషనర్ సిబ్బందిని అడిగితెలుసుకున్నారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు అందించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి భాధితులకు న్యాయం చేయాలని, ప్రజల నమ్మకానికి తగ్గట్లుగా పనిచేసి ప్రజల అభిమానాన్ని పొందాలని, శాంతిభద్రతల పరిరక్షణ కొసం నిరంతరం అప్రమత్తంగా వుండాల్సిన భాధ్యత మనపై వుందని.. ముఖ్యంగా నేరాలను నియంత్రించడం కోసం సి.సి కెమెరాల ఎర్పాటుపై ప్రజల్లో అవగాహన పెంచాలని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Total Page Visits: 4 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *