SGS TV Telugu

24×7 News

కోవిడ్ నిజంగా ప్రాణాంతక మైన మహమ్మారా….?

1 min read

కోవిడ్ వచ్చిన వారిలో ఎందుకింత అసహనం..భయం.. నిజంగా అందరూ చనిపోతారా…వైద్యం అంత ఖరీదా.. మన దేశం హాండిల్ చేయలేదా,,,, నిజానిజాలు తెలుసుకుందాం..నిర్భయంగా .,,

కోవిడ్ వచ్చిన వారిలో 80% కు ఏమి కాదు.. ఇందులో రెండురకాలుంటారు.. కొందరికి వచ్చినట్లు తెలియనే తెలియదు.. కొందరికి లక్షణాలుంటాయి.. జలుబు,జ్వరం, గొంతురాపిడి,తుమ్ములు,నీరసం, అజీర్ణం, భేదికి, ఇవన్నీ మామూలు లక్షణాలు..దగ్గు, ఆయాసం, గుండెదడ ముఖ్య లక్షణాలు…

ఈ లక్షణాలు ఉన్నవారు స్వాబ్ టెస్టు చేసుకోవాల.. RTPCR/RAT TEST.. RAT TEST లో 50%…RTPCR లో 70% పాజిటివ్ వస్తాది… అంటే 30% కోవిడ్ ఉన్నా నెగటివ్ రావచ్చు,.. ఎందుకంటే టెస్ట్ చేసే సమయం 4-7 రోజులలో పాజిటివ్ ఎక్కువ రావచ్చును.. మనకు swab తీసే నర్సు ముక్కులో బాగా స్వాబ్ తిప్పిందా లేదా, మనం సరిగ్గా సహకరించామా లేదా అనే దానిని పట్టి ఉంటాది,,,,

పాజిటివ్ వచ్చినా రాకపోయినా లక్షణాలుంటే మనం ఏం చేయాలి?

స్వీయగృహనిర్బంధం లోకెళ్ళాలి.. పారసిటమాల్ కిట్ లేక 300 కిట్ వాడాలి..బాగా నీరు తాగాలి..మాస్కు వేసుకోవాలి..ఒక పల్సు ఆక్సిమీటరు కొని ఆక్సిజన్ శాతం చూసుకోవాలి .. 93% పైన ఉంటే బేఫికర్ గా ఉండాలి,,,ప్రశాంతంగా పది రోజులు సినిమాలు చూసుకుంటూ, పాటలు వింటూ ఉండాలి..మధ్య మధ్యలో లేసి నడవాలి, ప్రాణాయామంచేయాలి,., ఏదైనా తింటూ ఉండాలి,.. ధైర్యంగా లేకుంటే 104 కు కాల్ చేయాలి లేదా డాక్టరు తో కౌన్సిలింగ్ ఫోనులో ఉండాలి..ధైర్యంగా పదిరోజులు గడిపితే మరలా స్వాబ్ టెస్టు కూడా అవసరం లేదు,.,జనజీవనస్రవంతిలో కలవాలి..

పాజిటివ్ అవుతానే మనమేం చేస్తున్నాం?

లక్షణాలు వస్తానే పోయి అన్ని పరీక్షలు చేయిస్తున్నాం,, అందరికి ఫోన్ లు చేసి సలహాలడుగుతున్నాం,,తలా ఒకమాట చెబుతానే భయపడుతున్నాం,,భయాపడితే టెన్షన్ వచ్చి ఆయాసం వస్తాది,,ఇంకా భయం పెరుగుతుంది,, ఆస్పత్రులకు పరిగెత్తుతున్నాం,,బెడ్ లో పడుకోని లెక్క లేసుకొని..ఇంకా భయపడుతున్నాం.. ఉన్న బెడ్లు నిజంగా అవసరమైన వారికి లేకుండా అందరికీ పానిక్ క్రియేట్ చేస్తున్నాం.. అందరినీ తిడుతున్నాం…

పరీక్షలు అవసరమా?

D-DIMER,CRP,CT SCAN CHEST — ఈ మూడే పరీక్షలు అవసరం..మనం ల్యాబ్ కెళ్ళి ప్రతి మూడు రోజులకు ఎన్నో పరీక్షలు చేయించుకొని ప్రతిసారి 10,000 పైన ఖర్చుపెట్టి దేశం రిసౌర్సెస్ వేస్టు చేస్తున్నాం..D DIMER, CRP అన్ని ఇన్ఫెక్షన్లులో కొంచెం పెరగతాయి..కాని బాగా 5 రెట్లు పైన పెరిగితేనే రక్తం పలుచబడే మందులు వాడాల,. CT SCAN CHEST ప్రాధమిక దశలో వేస్టు.. ఆస్పత్రిలో చేరితే తీస్తారు,,. CORAD 5 అంటే కాన్సరు స్టేజిమాదిరి సీరియస్ కాదు..అది కోవిడ్ ఉందని..అంతే..

ఎవరు ఆస్పత్రిలో చేరాలి???

10% కే అవసరం,,,ఆక్సిజను శాతం 93% కంటే తక్కువ అయితే 104 కు కాల్ చేసి ఎక్కడ బెడ్ ఉంటే అక్కడ చేరాల.. నాకు ఎసి రూములు కావాల, స్పెషల్ ఉండాల అనే దర్పం చూపించరాదు,,, ఆస్పత్రులలో చేరిన తరువాత రూల్సు పాటించాల…నాకా సూదేయి, ఈ మందులేయి అని గదమాయించరాదు,.వైద్యులపని వైద్యులను చేయనివ్వాలి…

ఆస్పత్రులలో ఏం చేస్తారు???

ఆక్సిజను ముక్కు ద్వారా, మాస్కు ద్వారా ఇస్తారు… CPAP, HFNO ద్వారా కూడా ఇస్తారు… వెంటి లేటరు ఇంట్యుబేట్ చేయడం చాలా అరుదుగా చేస్తారు…

స్టీరాయిడ్సు మందులు ఇస్తారు… హెపారిన్ ఇస్తారు,,ఆంటీబయాటిక్సు సూదులిస్తారు… రెమిడిసువీరు 6-9 రోజుల్లో అవసరమైతే ఇస్తారు..అది లేకపోయినా ఏమికాదు.. ప్లాస్మా, టోసిలిక్సుమాబు అత్యంత అవసరమేంకాదు,,, అవి లేకపోయినా నష్టము లేదు… సైటోకైన్ స్టార్ము ఉంటే స్టీరాయిడ్సు ఆక్సిజన్ మాత్రమే పని చేస్తాది….

మనము భయపడి అనవసరంగా పానిక్ అయి అందరినీ భయపెట్టి, బెడ్సు అన్నీ ఆకుపై చేసి దేశం రిసౌర్సెస్ అన్నీ వేస్టు చేస్తున్నాము,,..

ముందు మన భయం, అతి, దర్పం, డబ్బుపొగరు తగ్గించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది … 99% మందిని ఈ మహమ్మారి అనే కాగితం పులి ఏం చేయలేదు… ఇది ప్రాణాంతకమైనది కాదు..

శుభంభూయాత్,,శుభమస్తు ….

Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు. ఆంధ్రప్రదేశ్.

Total Page Visits: 12 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *