SGS TV Telugu

24×7 News

కొబ్బరి నీళ్లతో ఆరోగ్యం మీ వెంటే

1 min read

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ విషయంలో ఎవరికి అనుమానం లేదు. అయితే మనలో చాలా మంది కొబ్బరి నీళ్లను వేసవి కాలంలోనే తీసుకుంటుంటారు. ఏడాది పొడుగునా అందుబాటులో ఉండే కోకోనట్ వాటర్ ఎప్పుడు తాగితే మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకుందామా…

ఒక కొబ్బరి బోండాం, ఒక సెలైన్ బాటిల్ లో సమానం అని అంటుంటారు. రెండో ప్రపంచ యుద్ధ సమంలో సెలైన్ల కొరతతో గాయపడిన సైనికులకు గొబ్బరి బోండాలనే ఇచ్చేవారట. ఆరోగ్యానికి కొబ్బరి నీళ్లు చేసే మేలు అలాంటిది లేత కొబ్బరి బొండాల్లో 90 నుంచి 95 శాతం నీరు, 24 కేలరీల శక్తి ఉంటుంది. 100 గ్రాముల కొబ్బరి నీటి నుంచి 17.4 క్యాలరీల శక్తి లభిస్తుంది-

పోషక విలువలు పుష్కలంగా ఉండే ఈ కొబ్బరి నీళ్లను ఏ కాలంలోనైనా, ఏ సమంలోనైనా తీసుకోవచ్చు. అయితే నిత్యం ఉదయాన్నే పరగడుపునే కొబ్బరి నీళ్లను తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం

ప్రతి రోజు ఉదయాన్నే కొబ్బరి నీళ్లను తీసుకోవడం ద్వారా నిరోధక శక్తి పెరుగుతుంది

అలాగే శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. శరీరంలో ఉండే బాక్టీరియా, వైరస్లు బయటకు వెళ్లిపోతాయి. షుగర్ డయాబెటిస్) ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగితే.. షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. ఇన్సులిన్లో వేగం పెరుగుతుంది. ఈ నీటిలోని మెగ్నీషియం టైప్ 2 డయాబెటిస్, ప్రీ-డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది.

కొబ్బరి నీళ్ల వల్ల మూత్ర నాళాలు, కిడ్నీల్లో ఉండే రాళ్లు కరిగిపోతాయి. శరీరానికి కొత్త శక్తి వస్తుంది. రోజంతా యాక్టివ్ గా ఉండేందుకు దోహద పడుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మంపై ఉండే మచ్చలు పోతాయి. చర్మం మృదువుగా మారుతుంది. కంటి చూపుకు జీర్ణాశయం, పేగుల ఆరోగ్యానికి ఈ కోకోనట్ వాటర్ ఉపయోగపడుతుంది

అజీర్ణం, గ్యాస్, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం ఉండదు. విరేచనం సాఫీగా అవుతుంది. డీహైడ్రేషన్ బారిన పడే వారు ఉదయాన్నే కొబ్బరి నీళ్లను తాగితే మంచిది ఎక్సర్ సైజ్ చేశాక కొబ్బరినీళ్లు తాగితే బాడీలోని నీరసాన్ని వెంటనే తగ్గిస్తుంది. తల తిరగడం, కడుపులో గడబిడ వంటి వాటిని తరిమికొట్టడంలో కొబ్బరి నీళ్లకు తిరుగులేదు. గుండె జబ్బులు ఉన్న వారు రోజుకో కొబ్బరి బోండం ఎత్తితే హార్ట్ ఆరోగ్యంగా ఉంటుంది

Total Page Visits: 13 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *