ఆరోగ్యానికి బార్లీ వాటర్.. రోజూ తాగి ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు తెలుసా..?

1 min read

ఆరోగ్యానికి బార్లీ వాటర్.. రోజూ తాగి ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు తెలుసా..? తయారీ విధానం..
ఒక పాత్రలో లీటర్ రెండు లీటర్ల తాగునీటిని తీసుకుని వాటిలో కొన్ని బార్లీ గింజలను వేయాలి. లేకపోతే మిక్సి పట్టి పొడిని రోజుకు కొద్దిగా వేయొచ్చు. 20 నిమిషాలపాటు ఈ నీటిని మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా మారి పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. తర్వాత ఆ నీటిని చల్లార్చి వడపోయాలి. దీంతోపాటు ఉంటే.. అందులో కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవాలి. ఈ నీటిని నిత్యం ఉదయాన్నే పరిగడుపున తాగాలి. లేదా మధ్యాహ్నం ఎండకు బయటకు వెళ్లివచ్చిన తర్వాత కూడా తాగవచ్చు.
బార్లీ నీటి లాభాలు
• బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ, విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.
• మూత్రాశయం శుభ్రంగా మారుతుంది.
• కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.
• మూత్ర సమస్యలన్నీ తగ్గిపోతాయి.
• జీర్ణశాయ ఇబ్బందులు, ఉదర సమస్యలు తొలగిపోతాయి.
• కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
• రోజూ బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలోని వేడి బయటకు పోయి చల్లగా మారుతుంది.
• బరువు తగ్గాలనుకునే వారు బార్లీ నీటిని తాగితే బరువు తగ్గుతారు.
• బార్లీ నీటి వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.
• రక్త సరఫరా మెరుగు పడుతుంది.
• వడదెబ్బ తాకకుండా ఉండాలన్నా.. ఎండలో తిరిగి వచ్చిన వారు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలన్నా.. బార్లీ నీటిని తాగితే మంచిదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.Ltr

Total Page Visits: 204 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed