SGS TV Telugu

24×7 News

విజయవాడ: నగరంలోని వాంబే కాలనీలో దారుణం

1 min read

విజయవాడ: నగరంలోని వాంబే కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త ఉన్మాదిలా మారి కట్టుకున్న భార్య, ఇద్దరు పిల్లలను అతికిరాతకంగా హత్య చేశాడు. కుటుంబసభ్యులందరినీ హత్య చేసి ఉల్లి వ్యాపారి మోహన్ పరారయ్యాడు. మృతులు నీలవేణి, ఝాన్సీ, సాయిగా గుర్తించారు. రక్తపు మడుగులో మృతదేహాలు పడి ఉన్నాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Total Page Visits: 18 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *