రాడ్లతో కొట్టి చంపిన హంతకులు

1 min read

చావుల మదం వద్ద దారుణ హత్య

రాడ్లతో కొట్టి చంపిన హంతకులు

గంజాయి గ్యాంగ్ మధ్య తగాదాలు

హంతకుల కోసం పోలీసులు వెతుకులాట

విశాఖలో.నగరంలోని చావుల మదం వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు . గంజాయి గ్యాంగ్ లో ఏర్పడిన విభేదాలు లో భాగంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కొబ్బరి తోట భూపేష్ నగర్ ప్రాంతానికి చెందిన నీలపు చంద్రశేఖర్ (23 ) అలియాస్ ఐరన్ మాన్ ఈ సంఘటనలో మృతి చెందాడు. ఇతని ఒంటిపై కత్తులతో నరికి నట్లు పలు గాయాలున్నాయి. ఇనుప రాడ్ తో తో తల పై బలంగా కొట్టినట్లు తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఇతడిపై ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో దొంగతనం కేసు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా ఐరన్ మ్యాన్ హత్యకు గల కారణాలు ఏమిటి? ఎవరు ఇతడిని హతమార్చారు ? అన్నది తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి టూటౌన్ సీఐ వెంకటరావు దర్యాప్తు చేస్తున్నారు.(నిన్న రాత్రి జరిగింది).

Total Page Visits: 121 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed