భార్య గొంతు కోసిన భర్త… భర్తను స్తంభానికి కట్టేసిన స్థానికులు

1 min read

గుంటూరు జిల్లా: చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు మండలం బోయపాలెంలో భార్య గొంతు కోసిన భర్త సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేగింది. పూర్తి వివరాల ప్రకారం ఒరిస్సాకు చెందిన ఫోపూన్ గనున్ (37) రీటా (28) ఇద్దరూ భార్య భర్తలు. వీరు స్థానికంగా ఉన్న రంగనాయక స్పిన్నింగ్ మిల్లులో కార్మికులుగా పనిచేస్తున్నారు. భార్యపై అనుమానంతో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య రీటా గొంతు కోసాడు ఫోపూన్ గనున్. స్థానికులు అతనిని స్తంభానికి కట్టివేసి కొంత దేహశుద్ధి చేసి సమాచారాన్ని ఎడ్లపాడు పోలీసులకు అందించారు. ఎడ్లపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తుండగా తన పై బ్లేడుతో దాడి చేయభోగా తాను కూడా భార్యపై దాడి చేసినట్లు అందుకు భార్య రీటా గొంతు కోసినట్లు పోలీసులకు తెలియజేశాడు. గాయపడిన రీటాను పోలీసులు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి నిలకడగా ఉంది. పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎడ్లపాడు ఎస్సై పి.రాంబాబు తెలిపారు.

Total Page Visits: 112 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed