SGS TV Telugu

24×7 News

భార్యను పుట్టింటికి పంపి కానిస్టేబుల్ తీవ్ర నిర్ణయం!

1 min read

గొంతు కోసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మలక్పేట్ పోలీస్టేషన్ పరిధి ముసారాంబాగ్లో చోటు చేసుకుంది. ప్రముఖ వెబ్ సైట్ కథనం ఆధారంగా వివరాలు ఇలా ఉన్నాయి. అభిలాష్ అనే కానిస్టేబుల్ మాదన్నపేట పోలీస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. రెండు రోజుల క్రితం తన భార్య, ఇద్దరు పిల్లలను కోదాడలోని అత్తారింట్లో వదిలి వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తన గదిలోకి వెళ్లిన అభిలాష్ గడియ పెట్టుకున్నాడు. అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు తలుపు బద్దలుకొట్టి చూడగా రక్తపు మడుగులో అభిలాష్ కనిపించాడు. వెంటనే పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. కత్తితో గొంతు, చేతి మణికట్టు వద్ద కోసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతోనే అభిలాష్ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు
చేస్తున్నారు.

Total Page Visits: 21 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *