పెళ్లైన 3 నెలలకే యువతి ఆత్మహత్య

1 min read

ప్రేమ పెళ్లి..పెళ్లైన 3 నెలలకే
తెలిసి తెలియని వయస్సులో ప్రేమ.. పెద్దలను ఎదురించి పెళ్లి.. పెళ్లైన 3 నెలలకే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని చిక్ బళ్లాపూర్ జిల్లా గుడిబందె తాలూకా గ్రామమైన బెవినహళ్లిలో రాజు కుటుంబం నివాసం ఉంటుంది. రాజు కుమార్తె పేరు మమత. మమత అలీపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ చదువుతుండగా మణికంఠ అనే యువకున్ని ప్రేమించింది. మమత ప్రేమ వ్యవహారం తెలిసిన ఆమె తల్లితండ్రులు మణికంఠ పై 2020 జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఈ ఘటనతో మమత, మణికంఠ మరింత మొండిగా మారారు. 3 నెలల క్రితం ఇంట్లో ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు.

పెళ్లైన తర్వాత వారి బతుకు భారమైంది. ఇదే క్రమంలో మమత పుట్టిన రోజు వచ్చింది. తన పుట్టిన రోజుకు డ్రెస్ కొనివ్వాలని కోరింది. లాక్ డౌన్ అమల్లో ఉందని, షాపులు తీయలేదు. కావున డ్రెస్ కొనలేనని చెప్పాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన మమత ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడింది. మమత ఆత్మహత్య చేసుకోదని, మణికంఠ, అతని తల్లే చంపారని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు. మణికంఠను. అతని తల్లిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Total Page Visits: 57 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed