గంజాయి ముద్దాయులు అరెస్ట్

1 min read

నెల్లూరు: అక్రమంగా గంజాయి వ్యాపారం చేస్తున్న ముగ్గురు ముద్దాయిలను వాకాడు సీఐ నరసింహరావు, కోట ఎస్సై మహేంద్రనాయక్ లు బుధవారం అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా స్థానిక కోట పోలీస్ స్టేషన్ లో సీఐ, ఎస్.ఐ ల సమక్షంలో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సీఐ నరసింహారావు విలేకరులతో మాట్లాడుతూ………

నెల్లూరు జిల్లా కోట మండలంలోని ఆకుతోట దిబ్బ కాలనీకి చెందిన సయ్యద్ అహ్మద్ బాషా, సయ్యద్ బి బి జాన్, షేక్ వహీదా అనే ముగ్గురూ ప్రత్యక్షంగా గంజాయితో పట్టుబడ్డారని ఆయన అన్నారు.

తమకు అందిన సమాచారం మేరకు శ్యామసుందరపురంలోని సాయిబాబా గుడి వద్ద రోడ్డుపై ఉండే సింగంశెట్టి కోటయ్య అనే పాడుబడిన రేకుల ఇంటికి సాయంకాలం 5 గంటల సమయాన ముగ్గురు ముద్దాయిలు నంబరు లేని నలుపు రంగు టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనం ప్రక్కనే మూడు సంచులతో నిలబడి ఉండగా అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులును చూసి తప్పించుకోగా స్థానిక ఎస్ఐ.బీబీ మహేంద్ర నాయక్ వారిని వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు.

వారి వద్ద నుండి 25 కేజీల 405 గ్రాముల కలిగిన 2 లక్షల 50 వేల రూపాయల విలువ చేసే 12 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

ఈ విషయంపై దర్యాప్తు చేపట్టి ముగ్గురు ముద్దాయిలను మంగళవారం రాత్రి మధ్యవర్తుల సమక్షంలో అరెస్టు చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో వాకాడు సీఐ నరసింహారావు, కోట ఎస్.ఐ.బి. బి.మహేంద్ర నాయక్, ఐడి పార్టీ సిబ్బంది షేక్. సిరాజ్, సాయి, కార్తీక్, రైటర్ కృష్ణ తదితర పోలీసు సిబ్బంది ఉన్నారు.

Total Page Visits: 10 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed