SGS TV Telugu

24×7 News

కిలాడీ లేడీ మోసాలకు చెక్ పెట్టిన నల్లగొండ జిల్లా పోలీసులు

1 min read
  • పెండ్లి సంబంధాల పేరిట అబ్బాయిల పేర్లు మార్చి చెపుతూ మోసాలకు పాల్పడుతున్న యువతి
  • సామాజిక మాధ్యమాలు వేదికగా వలపు వల విసురుతూ డబ్బులు దండుకుంటున్న వైనం
    *పదుల సంఖ్యలో బాధితులు, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన బాధితులు

నల్లగొండ: పెండ్లి సంబంధం కోసం మీ ఫోటో ఎవరికైనా ఇస్తున్నారా, ఆ వ్యక్తి గురించి మీకు అన్ని వివరాలు తెలిస్తేనే ఇవ్వండి….. లేదంటే ఇలా మోసపోతారని హెచ్చరిస్తున్నారు నల్లగొండ జిల్లా పోలీసులు

ఇలా అబ్బాయిల ఫోటోలను అమ్మయిల తల్లితండ్రుల వద్ద నకిలీ పేర్లతో, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారంటూ సంబంధం మాట్లాడతానని డబ్బులు దండుకుంటుంది ఈ కిలాడీ లేడి… అంతే కాదు తాను ఎవరి ఫోటోలైతే అమ్మాయిల తల్లితండ్రులకు చూపిస్తుందో వాళ్లను సైతం బెదిరిస్తూ తాను అడిగినంత ఇవ్వకపోతే ఆ కేసులలో ఇరికిస్తానని బెదిరింపులకు పాల్పడుతుంది ఈ మాయలేడి… ఇలా మోసాలకు పాల్పడుతూ డబ్బులు దండుకుంటున్న కిలాడీ లేడీని అరెస్ట్ చేసి ఆమె చేస్తున్న మోసాలకు ఫుల్ స్టాప్ పెట్టారు నల్లగొండ జిల్లా పోలీసులు…

Total Page Visits: 367 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *