అనంతపురంలో వ్యక్తి దారుణ హత్య
మరొకరికి తీవ్ర గాయాలు

1 min read

క్యాపిటల్ వాయిస్ ముదిగుబ్బ:- అనంతపురం జిల్లాలో సోమవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, ఆస్తుల వివాదంలో ఇద్దరు వ్యక్తుల పై ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే మరణించగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…. ముదిగుబ్బ మండలం దిగువ చెర్లోపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి కేశవ, గంగరాజులు సోమవారం ఉదయం సరుకులు కొనుగోలు నిమిత్తం ద్విచక్ర వాహనం లో ముదిగుబ్బ కు వెళ్లారు. సరుకులు కొనుగోలు అనంతరం ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి బయలుదేరారు. యోగివేమన జలాశయం వద్దకు వెళ్లగానే అక్కడ కాపు కాసిన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో వీరి పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కుమ్మరి కేశవ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి గంగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్తుల వివాదం నేపథ్యంలో ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Total Page Visits: 45 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed