రాశి ఫలాలు

1 min read

.
​మేషం..

ఈ రోజు మీరు దానాలు చేయడంలో గడుపుతారు. ఇందులో మీకు మానసిక శాంతి కూడా లభిస్తుంది. పనిప్రదేశంలో మీకు కొన్ని అనుకూలమైన మార్పులు ఉండవచ్చు. ఫలితంగా సహోద్యోగుల మానసిక ఆనందం చెదిరిపోతుంది. కానీ మీ ప్రవర్తనతో మంచి వాతావారణాన్ని తీసుకురాగలరు. మీ జీవిత భాగస్వామికి వచ్చే సమస్యల గురించి ఈ రోజు మీరు ఆందోళన చెందుతారు. ఈ రోజు మీకు అదృష్టం 53 శాతం మద్దతు ఇస్తుంది.

​వృషభం..

వృషభం రాశి వారికి ఈ రోజు కుటుంబంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు అదృష్టం కలిసి వస్తుంది. సంతోషకరమైన శుభవార్త లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. చాలాకాలంగా మీరు ఎదురుచూస్తోన్న అతిథి రాక ఆనందం కలుగుతుంది. రాత్రి సమయంలో ఏదైనా శుభకరమైన కార్యక్రమంలో పని చేయడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. ఈ రోజు మీకు అదృష్టం 62 శాతం కలిసి వస్తుంది.

​మిథునం..

తండ్రి ఆశీర్వాదం వల్ల విలువైన వస్తువు లేదా ఆస్తి పొందాలనే కోరిక నెరవేరుతుంది. అనసవర ఖర్చులను నియంత్రించండి. సాయంత్రం నుంచి రాత్రి వరకు వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకిష్టమైన వ్యక్తిలను కలవడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఈ రోజు మీకు అదృష్టం 66 శాతం మద్దతు ఇస్తుంది.

కర్కాటకం..

రాశి స్వామి ఉత్తమ స్థితిలో ఉండటం వల్ల ఈ రోజు మీరు అనుకోకుండా పెద్ద మొత్తంలో సంపదను ఆర్జిస్తారు. వ్యాపార ప్రణాళికలు ఊపందుకుంటాయి. మీ కీర్తి, ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి. భావోద్వేగంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తర్వాత బాధపడాల్సి ఉంటుంది. సాయంత్రం దైవదర్శనం చేసుకుంటే మంచిది. సాయంత్రం నుంచి రాత్రి వరకు అర్ధరాత్రి వరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రోజు మీకు అదృష్టం 61 శాతం కలిసి వస్తుంది.

​సింహం..

రాజకీయ రంగంలో ఉన్న వారికి అకాల విజయాలు ఉంటాయి. పిల్లల బాధ్యతలు కూడా నెరవేరుతాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. జీర్ణ, కంటి సంబంధిత సమస్యలు వేధిస్తాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు మీకిష్టమైనవారితో సరదాగా సమయాన్ని గడుపుతారు. ఆహారం, పానీయాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు మీకు అదృష్టం 63 శాతం మద్దతు ఇస్తుంది.

​కన్య..

రాశి స్వామి బుధుడు మీ రాశి నుంచి 9వ పాదంలో ఉండటం వల్ల డబ్బు ఖర్చయ్యే అవకాశముంది. అయినప్పటికీ మీ మనస్సు ఆనందంగా ఉంటుంది. ప్రత్యర్థులకు తలనొప్పిగా మారతారు. జీవితంలో సంతోషం నెలకొంటుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు మీకిష్టమైనవారితో సమయాన్ని గడుపుతారు ఆహారం, పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాల్లో తలదూర్చకపోతే మంచిది. ఈ రోజు మీకు అదృష్టం 63 శాతం కలిసి వస్తుంది.

​తుల..

చదువు, పోటీ పరీక్షల్లో ఈ రోజు మీరు ప్రత్యేక విజయాలు సాధిస్తారు. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. మీ సంభాషణ శైలి మీకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకొస్తుంది. ప్రతికూల వాతావరణ ప్రభావాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు సాగించే అవకాశముంది. ఫలితంగా ప్రయోజనం అందుకుంటారు. పనిప్రదేశంలో పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఈ రోజు మీకు అదృష్టం 77 శాతం మద్దతు ఇస్తుంది.

​వృశ్చికం..

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా బలంగా ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించుకుంటారు. మీ మాటలపై సంయమనం కలిగి ఉండండి. సాయంత్రం మీకిష్టమైనవారిని కలవడం వల్ల మనస్సు ఆనందంగా ఉంటుంది. రాత్రి సమయంలో సరదాగా రన్నింగ్ చేస్తారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీకు అదృష్టం 70 శాతం కలిసి వస్తుంది.

​ధనస్సు..

ఈ రోజు గృహ వినియోగాలపై డబ్బు అధికంగా ఖర్చవుతుంది. ప్రాపంచిక ఆనందం వృద్ధి చెందుతుంది. సహోద్యోగులు, బంధువుల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ప్రజలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. మీకు వ్యతిరేకంగా చేసిన కుట్రలు విఫలమవుతాయి. అనవసర విషయాలను పట్టించుకోకండి. ఈ రోజు మీకు అదృష్టం 56 శాతం మద్దతు ఇస్తుంది.

​మకరం..

ఈ రోజు వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఫలితంగా మనస్సు ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో గతంలో కంటే వృద్ధి చెందుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ బాధ్యతలు నెరవేరుతాయి. సాయంత్రం ఆధ్యాత్మిక, ధార్మిక ప్రదేశాలకు వెళ్లడం అనుకూలంగా ఉంటుంది. వాహనాల వాడకంలో జాగ్రత్తగా ఉండండి. ప్రమాదవశాత్తు వాహన వైఫల్యం కారణంగా ఖర్చులు పెరగవచ్చు. ఈ రోజు మీకు అదృష్టం 72 శాతం కలిసి వస్తుంది.

కుంభం..

రాశి స్వామి శని మీ రాశి నుంచి 12వ పాదంలో ఉండటం వల్ల జీవిత భాగస్వామికి శారీరక కష్టం వచ్చే అవకాశముంది. అంతేకాకుండా అధికంగా ఖర్చులు నెలకొంటాయి. చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోండి. సాయంత్రం సమయంలో జీవిత భాగస్వామి ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడుతుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీకు అదృష్టం 53 శాతం మద్దతు ఇస్తుంది.

​మీనం..

దాంపత్య జీవితం ఆనందకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు దూర ప్రయాణాలు చేయవచ్చు. వ్యాపారంలో పురోగతి కారణంగా మనస్సుకు ఆనందంగా ఉంటుంది. మానసిక మేధో భారం నుంచి బయటపడతారు. ఏదైనా ముఖ్యమైన సమాచారం సాయంత్రం సమయంలో చూడవచ్చు. ఫలితంగా మీ మనస్సు కూడా రిలాక్స్ గా ఉంటుంది. తల్లిదండ్రుల సలహా, దీవెనలు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోజు మీకు అదృష్టం 55 శాతం కలిసి వస్తుంది

Total Page Visits: 231 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed